Begin typing your search above and press return to search.

మురుగపై మహేష్ అలా చెప్పాడు

By:  Tupaki Desk   |   26 Sep 2016 6:00 AM GMT
మురుగపై మహేష్ అలా చెప్పాడు
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో భాగంగా.. తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. అయితే.. తమిళ్ లో తన అరంగేట్రం గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇన్నేళ్లు వేచి చూసిన మహేష్.. ట్యాలెంటెడ్ దర్శకుడు మురుగదాస్ చెప్పిన స్టోరీకి మెస్మరైజ్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ ని కూడా పూర్తి చేసేసుకుంటోంది.

నిన్న (సెప్టెంబర్ 25న) దర్శకుడు మురుగదాస్ బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ నుంచి ఊహించని రియాక్షన్ వచ్చింది. సాధారణంగా సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టే విషయంలో మహేష్ బాబు బాగా పొదుపు పాటిస్తూ ఉంటాడు. కానీ తన దర్శకుడి బర్త్ డే విషయంలో మాత్రం.. ఓ ట్వీట్ పెట్టి.. విషెస్ చెప్పి.. అనుకోని విధంగా పొగిడేశాడు సూపర్ స్టార్. 'ఏఆర్ మురుగదాస్ కు వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. మీతో కలిసి పని చేయడం గర్వంగాను.. గొప్పగాను ఉంది సార్. ఈ ఏడాది మీకు మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు మహేష్.

మహేష్ బాబు లాంటి గ్రేట్ స్టార్.. ట్యాలెంటెడ్ యాక్టర్ ఇలా తనతో పని చేయడం గర్వంగా ఉందని చెప్పడంతో.. మురుగదాస్ షాక్ తినేశాడట.