Begin typing your search above and press return to search.

నర్సింగ్ హోమ్ కి ఏజంట్ శివ సపోర్ట్

By:  Tupaki Desk   |   23 Oct 2016 4:28 AM GMT
నర్సింగ్ హోమ్ కి ఏజంట్ శివ సపోర్ట్
X
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో నవీన్ విజయ్ కృష్ణ తొలి సినిమా నందినీ నర్సింగ్ హోమ్. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ.. ఆల్రెడీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇతర డెబ్యూ హీరోల మాదిరిగా మాస్ హంగామా కోసం ప్రయత్నించకుండా.. సింపుల్ స్టోరీ అంతకంటే సింపుల్ గా డీల్ చేసి ఎంగేజ్ చేసిన విధానం బాగుందనే టాక్ ఉంది. మౌత్ టాక్ పెరిగితే సినిమాకి వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలో నందినీ నర్సింగ్ హోమ్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు రీఎంట్రీ ఇచ్చాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యి.. నందినీ నర్సింగ్ హోమ్ గురించి జనాలకు తెలియడానికి కారణం అయిన మహేష్.. ఇప్పుడు మరోసారి ఈ సినిమాకి హెల్ప్ చేస్తున్నాడు. 'నవీన్ సాధికారికంగా అరంగేట్రం చేశాడు. నందినీ నర్సింగ్ హోమ్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నా. టీమ్ కి అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు మహేష్.

సినిమా బాగుందని అంటున్నా.. వసూళ్లు నిరుత్సాహకరంగా ఉన్న సమయంలో.. మహేష్ ప్రమోట్ చేయడం.. నందినీ నర్సింగ్ హోమ్ కి కలిసొచ్చే విషయంగా చెప్పాలి. మంచి సినిమా అయితే తన సపోర్ట్ ఉంటుందని మహేష్ మరోసారి నిరూపించుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/