Begin typing your search above and press return to search.

అవును.. స్పైడ‌ర్ టీజ‌ర్ ఆ రోజే

By:  Tupaki Desk   |   26 July 2017 4:07 PM GMT
అవును.. స్పైడ‌ర్ టీజ‌ర్ ఆ రోజే
X
‘స్పైడ‌ర్’ టీజ‌ర్ గ్లింప్స్ అంటూ రెండు నెల‌ల కింద‌టే సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఒక విశేషాన్ని అభిమానుల‌తో పంచుకుంది స్పైడ‌ర్ టీం. దానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది కానీ.. సినిమాలోని షాట్లేమీ లేకుండా సింపుల్‌ గా అలా ముగించేయ‌డం అభిమానుల‌కు రుచించ‌లేదు. ఐతే అప్పుడు రిలీజ్ చేసింది టీజ‌ర్ కాదు.. టీజ‌ర్ గ్లింప్స్ మాత్ర‌మే అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అస‌లు టీజ‌ర్ లాంచ్ కాబోతోంది. అందుకు ముహూర్తం కూడా కుదిరింది. మ‌హేష్ బాబు పుట్టిన రోజు కానుక‌గా ఆగ‌స్టు 9న ‘స్పైడ‌ర్’ టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

‘స్పైడ‌ర్’ నుంచి మ‌హేష్ బాబు కొత్త స్టిల్ ఒక‌టి రిలీజ్ చేసి.. దాంతో పాటే టీజ‌ర్ గురించి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. మూవీ మేక‌ర్స్. ఆగస్ట్ 15 న రెండో పాటని, ఆగస్ట్ 25న మూడో పాటని, సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో జూక్ బాక్స్ ని విడుదల చేసేందుకు స్పైడర్ దర్శకనిర్మాతల ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ఫొటో.. ఈ న్యూసే హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘స్పైడ‌ర్’ హ్యాష్ ట్యాగ్స్ టాప్‌ లో ట్రెండ్ అవుతున్నాయి. సెప్టెంబ‌రు 27నే ఈ చిత్రం తెలుగు - త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న‌ట్లు కూడా ధ్రువీక‌రించారు. ‘స్పైడ‌ర్’ త‌మిళ వెర్ష‌న్ హ‌క్కుల్ని 2.0 నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ రూ.23 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు రెండు రోజుల కింద‌టే వార్త‌లొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ సినిమాకు రూ.170-200 కోట్ల మ‌ధ్య బిజినెస్ జ‌రుగుతున్న‌ట్లు చెబుతున్నారు. మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘స్పైడ‌ర్‌’లో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ న‌టిస్తోంది.