Begin typing your search above and press return to search.

స్పైడర్ పై 130 కోట్లు??

By:  Tupaki Desk   |   23 May 2017 6:02 PM GMT
స్పైడర్ పై 130 కోట్లు??
X
మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఇప్పటికే టాకీ పార్ట్ షూట్ మొత్తం పూర్తయిపోగా.. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈ రెండు పాటల్లో ఒకటి ఫారిన్ లొకేషన్స్ లోను.. రెండో పాటను హైద్రాబాద్ లోని స్టూడియోలో సెట్స్ వేసి తెరకెక్కించనున్నారు.

జూన్ 2తో స్పైడర్ పాటల షూటింగ్ కూడా పూర్తయిపోనుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిపోవడం బాగానే ఉంది కానీ.. సినిమా రిలీజ్ పై మాత్రం దర్శకుడు మురుగదాస్ నుంచి చిత్ర యూనిట్ ఎవరూ నోరు మెదపడం లేదు. ఇందుకు కారణం.. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండడమే. ఇప్పుడు గ్రాఫిక్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా బాహుబలి2తో పోలిక వచ్చేస్తుందనే విషయం స్పైడర్ యూనిట్ కి బాగానే అర్ధమైంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా.. బడ్జెట్ ను మరో 10 కోట్ల రూపాయల మేర పెంచారట.

బాహుబలికి వర్క్ చేసిన మకుట సంస్థకే ఈ వర్క్ కూడా అప్పగించడం విశేషం. ఈ లేటెస్ట్ 10 కోట్లతో కలిపి స్పైడర్ బడ్జెట్ మొత్తం రూ.130 కోట్లకు చేరిందని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది స్పైడర్.