Begin typing your search above and press return to search.

చిరు, రజని నిజమైన సూపర్ స్టార్స్ -మహేష్‌

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:30 PM GMT
చిరు, రజని నిజమైన సూపర్ స్టార్స్ -మహేష్‌
X
సూపర్ స్టార్ అనే బిరుదు ఏ హీరోకైనా అంత ఈజీగా రాదు. బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ కొల్లగొట్టే సత్తా ఉంటే సరిపోదు ఆ హీరో కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటేనే ప్రేక్షకులు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు స్పెషల్ ఇమేజ్ ని దక్కించుకున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నాసరే వారి కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సాదించుకున్నారు. అటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు.

ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న ఈ ఒక్కడు.. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా తన స్టామినాని చూపబోతున్నాడు. ఏర్. మురగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తమిళ్ లో డైరెక్ట్ గా రిలిజ్ చేస్తుండగా..మలయాళం లో డబ్ చేస్తున్నాడు. ఈ సందర్బంగా సూపర్ స్టార్ స్టాటస్ గురించి చెప్పమంటే.. ఒక రేంజు కామెంట్ చేశాడంతే. మీ దృష్టిలో రియల్‌ సూపర్‌ స్టార్లు ఎవరు అనడిగితే.. ''మన దేశంలో చాలా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. చిరంజీవిగారు - రజనీకాంత్‌ గారు... వీళ్లు నిజమైన సూపర్‌ స్టార్లు. సినిమాతో సంబంధం లేకుండా వాళ్ల కోసం థియేటర్లకు వెళ్తారు. నా దృష్టిలో నటుడి కంటే, స్టార్‌ కంటే సినిమానే గొప్పది'' అంటూ కామెంట్ చేశాడు మహేష్‌.

ఇక స్పైడర్ విషయానికొస్తే.. ఇన్నేళ్ళ మహేష్ కెరీర్ లో మొదటి సారి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీమంతుడు ఇచ్చిన బూస్ట్ తో మహేష్ ఈ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. తమిళ్ హీరోలు చాలామంది ఇక్కడ వారికంటూ ఓ మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. మన హీరోలు కూడా పరభాషా అభిమానులను ఇప్పుడిప్పుడే మెప్పిస్తున్నారు. సో మన మహేష్ కూడా సౌత్ లో మరో మంచి సూపర్ స్టార్ అవ్వాలని కోరుకుందాం..