Begin typing your search above and press return to search.

మహేష్ పై అప్పుడే రాజమౌళి ఎఫెక్ట్..

By:  Tupaki Desk   |   28 July 2015 8:22 AM GMT
మహేష్ పై అప్పుడే రాజమౌళి ఎఫెక్ట్..
X
స్టార్ హీరోల్లో మహేష్ బాబు రూటే సెపరేటు. అతను మాస్ సినిమాలు మరీ ఎక్కువేమీ చేయలేదు. ఒక వేళ మాస్ సినిమా చేసినా అది కూడా క్లాస్ గానే ఉంటుంది. ఫైట్లు చేసినా.. వయొలెన్స్ ఉన్నా ఓ స్థాయి వరకే ఉంటుంది. మరి ఈ విషయంలో రాజమౌళి స్టయిలే వేరు. హీరో చేతికి ఓ స్పెషల్ వెపన్ ఇచ్చి విలన్లను తెగ నరికిస్తాడు. ఈగ లాంటి అల్ప జీవికి కూడా ఓ ఆయుధమిచ్చి విలన్ పైకి అటాక్ చేయించిన ఘనుడు రాజమౌళి. ఐతే ‘బాహుబలి’ సినిమాలో కొంచెం రూటు మార్చి విలన్ చేతికి ఓ కొత్త ఆయుధాన్నిచ్చాడు. ఐతే జక్కన్న బాహుబలి-2 తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ చేతికి ఎలాంటి ఆయుధాన్నిస్తాడా ఇప్పటికే చర్చ మొదలైపోయింది.

ఐతే రాజమౌళితో సినిమా చేయబోతున్న నేపథ్యంలో రిహార్సల్ గానో ఏమో.. ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ కొత్త తరహా ఆయుధం పట్టాడు మహేష్. ఆ రాడ్ బోల్ట్ రూపంలో చాలా చిత్రంగా ఉంది. ఆ ఆయుధం పట్టి విలన్లపై అటాక్ కు రెడీగా ఉన్న మహేష్ ను చూస్తుంటే అభిమానులకు పూనకం వచ్చేస్తోంది. ఈ పోస్టర్ చూడగానే మహేష్ పై అప్పుడే రాజమౌళి ఎఫెక్ట్ పడిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కు తోడు యాక్షన్ కూడా కలగలిగిన అన్ని వర్గాల్నీ ఆకట్టుకునేలా ‘శ్రీమంతుడు’ తయారైందని చెబుతున్నాడు మహేష్. 1 నేనొక్కడినే, ఆగడు నిరాశ పరిచిన నేపథ్యంలో ఆగస్టు 7న విడుదలయ్యే ఈ సినిమాపై మహేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.