Begin typing your search above and press return to search.

కోలీవుడ్ దర్శకుడికి మహేష్ షాక్

By:  Tupaki Desk   |   25 May 2016 11:30 AM GMT
కోలీవుడ్ దర్శకుడికి మహేష్ షాక్
X
బ్రహ్మోత్సవం ఇచ్చిన షాక్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. తను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు మహేష్. సూపర్ స్టార్ తో సినిమా చేసేందుకు.. సౌత్ డైరెక్టర్ల నుంచి బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయి. అలా మహేష్ తో బైలింగ్యువల్ చేసేందుకు ఇద్దరు కోలీవుడ్ దర్శకులు ఉత్సాహం చూపుతున్నారు.

ఇప్పటికే తన మరుసటి చిత్రం మురుగదాస్ తో ఉంటుందని మహేష్ చెప్పేశాడు. మరో తమిళ దర్శకుడు అట్లీ కూడా మన సూపర్ స్టార్ తో సినిమా చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. రాజా రాణి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు.. రీసెంట్ గా విజయ్ హీరోగా రూపొందిన తెరితోను తమిళ్ కమర్షియల్ సక్సెస్ సాధించాడు. అయితే.. తెలుగులో మాత్రం పోలీసోడుగా వచ్చిన ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అట్లీతో సినిమా విషయంలో మహేష్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడట. కంప్లీట్ గా మాస్ ఎంటర్టెయినర్ విషయంలో అట్లీతో తనకు సరిపోదని భావిస్తున్నాడట మహేష్.

ఈ విషయాన్ని దర్శకుడికి నేరుగానే చెప్పేయడంతో.. ఇప్పుడు అట్లీ మళ్లీ కోలీవుడ్ కే వెళ్లిపోయి హీరోని వెతుక్కుంటున్నాడని తెలుస్తోంది. మళ్లీ విజయ్ కే స్టోరీ చెప్పడం.. తన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా జరిగిందని అంటున్నారు. సో.. మహేష్ నో అనగానే.. అట్లీ అక్కడికే వెళ్లిపోవాల్సి వచ్చిందన్న మాట.