Begin typing your search above and press return to search.

మహేష్ 'మాస్' సినిమా ఫేకేనట

By:  Tupaki Desk   |   24 Nov 2017 10:28 AM GMT
మహేష్ మాస్ సినిమా ఫేకేనట
X
ఒక సినిమా పూర్తి కాకముందే.. ఆ తర్వాతి సినిమాలను లైన్ లో పెట్టేయడంలో.. మహేష్ బాబు తర్వాతే ఎవరైనా. ఒకసారి ఒక సినిమాలో మాత్రమే నటించే మహేష్.. అది మొదలయ్యే నాటికే తర్వాతి సినిమా పనులు స్టార్ట్ చేసేస్తాడు. మరో సినిమాకి డిస్కషన్స్ చేస్తుంటాడు. అప్పటికే ఇంకో ప్రాజెక్టు ఖాయం అయిపోయి కూడా ఉంటుంది.

ప్రస్తుతం కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్నాడు మహేష్. స్పైడర్ రిలీజ్ కాక ముందే ఈ మూవీ షూట్ ని అధికారికంగా స్టార్ట్ చేసేశారు. ఇప్పుడీ భరత్ అనే నేను చిత్రం పనులు చకచకానే సాగుతున్నాయి. మరోవైపు తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేసేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్. ఇది కాకుండా.. మరో రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడని అంటారు. ఇలాంటి సమయంలో.. మాస్ డైరక్టర్ వివి వినాయక్ తో మహేష్ బాబు డిస్కషన్స్ జరుపుతున్నాడని.. ఓ అల్ట్రా మాస్ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపించింది.

అయితే.. ప్రస్తుతం తేజుతో మూవీని ఫైనల్ చేస్తున్నాడు మహేష్. మరో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. రెండేళ్ల తర్వాత మహేష్ మూవీ గురించి ఆలోచించే పరిస్థితే లేదని తేల్చేస్తున్నారు వినాయక్ సన్నిహితులు. మహేష్ తో వినాయక్ కాంబినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదని కూడా చెప్పేస్తుండడం విశేషం. అటు మహేష్ డైరీ కూడా ఫుల్లుగా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఒప్పుకున్న కమిట్మెంట్స్ ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్ బాబు. సో ఈ కాంబో గురించి వచ్చిన న్యూస్ జస్ట్ ఫేకే అనమాట.