Begin typing your search above and press return to search.

మహేష్ ఎంత మంచోడబ్బా!!

By:  Tupaki Desk   |   23 March 2018 7:26 AM GMT
మహేష్ ఎంత మంచోడబ్బా!!
X
సెలబ్రిటీలు.. స్టార్స్ తో ఫోటో దిగడం.. చాలామందికి ఇది ఒక కల. ఆ డ్రీమ్ కలగానే మిగిలిపోయే వాళ్లు కొందరు అయితే.. మరికొందరికి ఈ కల నెరవేరుతుంది. అయినా మహేష్ బాబుతో ఫోటో దిగాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి? కానీ అది తీరేదెలా అన్నదే పాయింట్.

వీరాభిమానులు కొందరు ఎలాగోలా సూపర్ స్టార్ తో ఓ ఫోటో దిగి పదిలంగా దాచుకుంటారు. మిగిలిన వారు అలాంటి చాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు కూడా మహేష్ కు వీరాభిమాని. చాలాకాలంగా మహేష్ బాబుతో ఫోటో ఆపర్చునిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అదే ఆశలతో మహేష్ ను సంప్రదించాడు. తన తండ్రితో కలిసి మహేష్ బాబును కలిశాడు ఈ కుర్రాడు. కేవలం ఓ సెల్ఫీ కావాలని అడడగా.. వాళ్ల ఫోన్ లోనే ఫోటో దిగే సమయాన్ని కేటాయించాడు మన సూపర్ స్టార్.

అంతే కాదు.. ఆ కుర్రాడి భుజంపై చేయి వేసి మరీ ఫోటో దిగాడు. అంతే ఆ సంతోషాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోయాడు ఆ తండ్రి. ఇవాళ తన కొడుకు కల నెరవేరిందని.. ఫోటో తీసుకునే అవకాశం సమయం కేటాయించిన మహేష్ బాబు కృతజ్ఞతలు చెప్పాడాయన. ఇంత సింపుల్ గా ఉండే సూపర్ స్టార్ మన తెలుగులో ఉండడం మనం గర్వించాల్సిన విషయం.. అంతనంటారా?