Begin typing your search above and press return to search.

`మ‌హ‌ర్షి` షారూక్ సినిమా స్ఫూర్తితో?

By:  Tupaki Desk   |   18 Oct 2018 5:39 AM GMT
`మ‌హ‌ర్షి` షారూక్ సినిమా స్ఫూర్తితో?
X
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం కెరీర్ 25వ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దిల్‌రాజు - అశ్వ‌నిద‌త్ నిర్మాత‌లు. పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ చిత్రంలో మ‌హేష్ విభిన్న‌మైన గెట‌ప్పుల్లో డిఫ‌రెంట్ ఆహార్యం చూపించ‌బోతున్నాడు. కాలేజ్ బోయ్‌గా, రైతుగా క‌నిపిస్తాడ‌న్న సమాచారం ఉంది. కాలేజ్ బోయ్ గెట‌ప్ కోసం లుక్ మార్చి క‌నిపించాడు. ప్ర‌స్తుతం అతడు యంగ్ టీనేజ‌ర్‌ లా మారిపోయి క‌నిపించ‌డం అంద‌రికీ షాకిస్తోంది.

అదంతా అటుంచితే మ‌హేష్ ల్యాండ్ మార్క్ సినిమాకి శాటిలైట్ - డిజిట‌ల్ - థియేట్రిక‌ల్ బిజినెస్ రూపంలో భారీ క్రేజు నెల‌కొంది. ఊపిరి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందించిన వంశీ పైడిపల్లి మ‌రో బంప‌ర్ హిట్ ఇస్తాడ‌న్న న‌మ్మ‌కం పంపిణీ వ‌ర్గాల్లో ఉంది. ఆ క్ర‌మంలోనే మ‌హ‌ర్షి శాటిలైట్ మ‌హేష్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తోంద‌ని తెలిసింది. మ‌హేష్ న‌టించిన గ‌త చిత్రం స్పైడ‌ర్ కి - 26.5కోట్ల మేర చెల్లించి జీచానెల్ కొనుగోలు చేసింది. ఇప్పుడు మ‌హ‌ర్షి చిత్రాన్ని భారీ కాంపిటీష‌న్ న‌డుమ జెమిని చానెల్ ద‌క్కించుకుంది. మ‌హేష్ కెరీర్ బెస్ట్‌గా జెమిని చెల్లిస్తోందిట‌. డీల్ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే టీజ‌ర్‌లో నేటివిటీ కాలేజ్ బోయ్ లుక్‌ తో అద‌ర‌గొట్టేసిన మ‌హేష్ క‌చ్ఛితంగా ఈసారి బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేస్తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాని కింగ్ ఖాన్ షారూక్ న‌టించిన `స్వ‌దేశ్‌` స్ఫూర్తి తో తెర‌కెక్కిస్తున్నార‌న్న ప్ర‌చారం ఇదివ‌ర‌కూ సాగింది. ఇక‌ బిజినెస్ ప‌రంగా చూస్తే.. మ‌హ‌ర్షి ఏరియా వైజ్ థియేట్రిక‌ల్ బిజినెస్‌కి భారీ పోటీ నెల‌కొంద‌న్న స‌మాచాం ఉంది. ఏప్రిల్ 5న ఉగాది కానుక‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.