Begin typing your search above and press return to search.

ఏయ్.. మహేష్‌ ఎలా ఉన్నాడో తెలుసా?

By:  Tupaki Desk   |   31 July 2016 4:46 AM GMT
ఏయ్.. మహేష్‌ ఎలా ఉన్నాడో తెలుసా?
X

సూపర్ స్టార్ మహేష్‌ తన కొత్త సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేశాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే మనోడు అసలు ఈ సినిమా కోసం చాలా రకాల కొత్త లుక్కులు ట్రై చేస్తున్నాడని అప్పట్లో రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా గెడ్డంతో కూడా ఒక లుక్ ను చూపేందుకు ప్రయత్నిస్తున్నాడని చాలా గాట్టిగానే వినిపించింది. ఇందులో ఎంతవరకు నిజముంది మరి?

ఇప్పుడు మహేష్‌-మురుగుదాస్‌ సినిమా షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయినదిగా చెప్పబడుతున్న ఫోటో ఒకటి నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో ప్రకారం చూసుకుంటే.. మహేష్‌ చక్కగా ఫార్మల్ వేర్ ధరించి.. సింపుల్ షేవ్ తో.. చాలా క్లాసీగా కనిపిస్తున్నాడు. ఒక యాంగిల్లో చూస్తే.. ఏదో 'నిజం' సినిమాలో మహేష్‌ ను మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది కూడా. అంతే కాని గెడ్డం లుక్కులో ఎక్కడా కనిపించట్లేదు. ఈ మధ్యన ఎక్కువగా యూత్ ఫుల్ లుక్కులో కనిపించిన మహేష్‌.. ఇప్పుడు కాస్త ఆఫీస్ గోయింగ్ కుర్రాడి టైపులో కనిపిస్తుంటే.. ఖచ్చితంగా చాలా కొత్తగానే ఉంటుందిలే.

ఏయ్.. మహేష్‌ ఎలా ఉన్నాడో తెలుసా? అబ్బబ్బా చింపేశాడు.. అంటూ అమ్మాయిలు మెలికలు తిరిగిపోతున్నారు ఇప్పుడు. కావాలంటే ఫేసుబుక్కులో వారు పెడుతున్న పోస్టులు చూడండి.. మీకే అర్ధమవుతోంది. అయితే నాలుగు రోజుల తరువాత ఈ సి్టల్ ఆ సినిమా షూటింగులో తీసింది కాదు అనకండే.