Begin typing your search above and press return to search.

మహేష్ కి నచ్చిన అభిమన్యుడు

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:37 AM GMT
మహేష్ కి నచ్చిన అభిమన్యుడు
X
ఇటీవల విడుదలైన విశాల్ కోలీవుడ్ సినిమా అభిమన్యుడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ కెరీర్ లోనే ఆ సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడమే కాకుండా అత్యధిక వసూళ్లను అందుకున్న చిత్రంగాను అభిమన్యుడు నిలిచింది. ఇతర ప్రముఖ తారలు కూడా చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన స్టార్ హీరోలు అయితే స్పెషల్ షోలు వేసుకొని మరి సినిమా చూస్తున్నారట.

అసలు మ్యాటర్ లోకి వస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా అభిమన్యు సినిమాను స్పెషల్ షో వేసుకొని మరి చూసేశాడు. మహేష్ కు నచ్చితే వెంటనే ట్వీట్ చేయడం అలవాటు. ఇక అభిమన్యుడు కూడా నచ్చడంతో ప్రిన్స్ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. సినిమా చాలా బావుంది. సినిమా అర్ధమయ్యేలా దర్శకత్వ ప్రతిభ కనిపిస్తోంది. చాలా బాగా రీసెర్చ్ చేసి సినిమాను తెరకెక్కించారు. కథానాయకుడు విశాల్ కి అలాగే చిత్ర యూనిట్ కంగ్రాట్స్ అంటూ మహేష్ విషెస్ అందించాడు.

ఇక ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ సోమవారం డెహ్రడున్ లో స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ లో కాలేజ్ కు సంబందించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు - సి.అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటుస్తున్న సంగతి తెలిసిందే.