మహేష్ అడవుల బాట!!

Fri Mar 15 2019 09:44:39 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ పరంగా వేగం పెంచుతున్న సంగతి తెలిసిందే. `భరత్ అనే నేను` తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాని పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్ కి కనెక్టయ్యేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు. టాకీ పూర్తయింది. తదుపరి రెండు పాటల్ని హైదరాబాద్ లో తెరకెక్కించనున్నారు. దిల్ రాజు - అశ్వనిదత్ - పీవీపీ వంటి దిగ్గజాలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ నటించే తదుపరి చిత్రాలపైనా బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది.మహేష్ 26 - మహేష్ 27 సహా వరుసగా అతడు నటించే సినిమాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ 26 సుకుమార్ చేయాల్సినది అనీల్ రావిపూడి కి ఖాయమైంది. మహర్షి తర్వాత దిల్ రాజు తెలివిగా మహేష్ ని లాక్ చేశారన్న మాట ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. అనీల్ సుంకర తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ 26 మైత్రి మూవీ మేకర్స్ చేయాల్సి ఉన్నా టేకోవర్ చేయడంలో దిల్ రాజు తెలివైన గేమ్ ప్లాన్ వర్కవుటైందని చెబుతున్నారు. ఇకపోతే సుకుమార్ కథ రిజెక్ట్ అవ్వడం మైత్రికి మరో పెద్ద మైనస్ గా మారింది.

అదంతా అటుంచితే మహేష్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే - మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించేస్తున్నారు. ప్రఖ్యాత కోలా బ్రాండ్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో యాడ్ షూట్ చేస్తున్నారు. అక్కడ అడవుల్లో - అరుదైన లొకేషన్లలో ఈ ప్రకనటనను చిత్రీకరిస్తున్నారట. సినిమాలు - వాణిజ్య ప్రకటనలతో భారీగా ఆర్జించే టాలీవుడ్ స్టార్ గా మహేష్ పేరు అగ్రపథంలో నిలుస్తోంది. ఏడాదికి 30-40 కోట్ల వార్షికాదాయంతో ఫోర్బ్స్ జాబితాలోనూ ఆయన పేరు నిలిచింది.