పీఠం కోసం మహేష్ చేసే పోరాటం

Tue Mar 13 2018 15:41:05 GMT+0530 (IST)


భరత్ అను నేను సినిమాలో ఎప్పుడు చేయని పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మహేష్ బాబు. ఆ సినిమాలో అతను సీఎంగా కనిపిస్తాడని  ఇప్పటికే మనకు తెలుసు. అయితే సినిమా మొత్తం ఆయన ముఖ్యమంత్రిగా కనిపించడట. కేవలం కొద్ది నిమిషాలే. మిగతాదంతా సీఎం కావడానికి మహేష్ చేసే పోరాటమే కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.డిఫరెంట్ మూవీలు... నిజ జీవిత ఘటనల ఆధారంగా సీన్లను సృష్టించడంలో కొరటాల శివ సిద్ధహస్తుడు. శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కొత్త కాన్సెప్టును పెట్టి సూపర్ హిట్ కొట్టించాడు. ఇప్పుడు భరత్ అను నేనులో కూడా కొన్ని నిజ ఘటనలు వాడినట్టు సినీ జనాల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించడం నిజమే. కానీ అతని విజయాన్ని చూసి ఓర్వలేని కొందరు నమ్మకస్తులే... వెన్నుపోటు పొడుస్తారట. దాంతో మహేష్ సీఎం పదవి నుంచి దిగిపోతాడట. తరువాత తన సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకోవడానికి మహేస్ చేసే పోరాటమే సినిమానట. చివరి అరగంట సేపు అతను పూర్తిస్థాయి సీఎంగా కనిపిస్తాడట. మరికొందరు చెప్పే దాని ప్రకారం.. సీఎంగా ఉన్న మహేష్ రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అజమాయిషీని ప్రశ్నించే సీఎంగా కనిపిస్తాడని అంటున్నారు.

కొరటాల శివ - మహేస్ కాంబినేషన్ ఇప్పటికే సూపర్ హిట్ అన్న టాక్ ఉంది. ఈ మధ్యన హీరో సీఎంగా కనిపించిన సినిమాలు కూడా రాలేదు. అప్పుడెప్పుడో ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ పవర్ ఫుల్ సీఎంగా కనిపించాడు. ఇప్పుడు మహేస్ ఏ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఇప్పటికే విడుదలైన టీజర్లు ట్రైలర్లు సినిమాపై అంచనాలను బాగా పెంచేశాయి. ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.