Begin typing your search above and press return to search.

మహేష్ క్లారిటీనా కన్ఫ్యూజనా!

By:  Tupaki Desk   |   13 Feb 2019 2:30 PM GMT
మహేష్ క్లారిటీనా కన్ఫ్యూజనా!
X
మహర్షి షూటింగ్ చివరి దశకు వస్తోంది. పాటల చిత్రీకరణతో పాటు కొంత టాకీ పార్ట్ మినహా మొత్తం పూర్తయిపోయినట్టు సమాచారం . దీని తర్వాత మహేష్ ఏది చేస్తాడు అనే విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. సుకుమార్ స్క్రిప్ట్ ఫైనల్ కావడానికి ఇంకో ఆరు నెలల దాకా టైం అవసరం పడుతుండటంతో వెంటనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేనట్టే. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా పేరు విన్పిస్తోంది కాని దాని రీమేక్ కబీర్ సింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రమోషన్ దాకా ఉండి హైదరాబాద్ తిరిగి వచ్చేందుకే జూలై అవుతుంది.

అప్పటిదాకా మహేష్ ని వెయిట్ చేయించడం భావ్యం కాదు. ఎందుకంటే సందీప్ దగ్గరా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందా అంటే అదీ డౌటే. మరోవైపు ఎఫ్2 లాంటి పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఓ లైన్ చెప్పాడని డెవలప్ చేసాక నిర్ణయం తీసుకుందామని ప్రిన్స్ అన్నట్టు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇవి చాలదు అన్నట్టు తరుణ్ భాస్కర్ వచ్చి చేరాడు.

మహేష్ సంస్థ కొలాబరేషన్ తో వెబ్ సిరీస్ తీసే ప్రతిపాదనతో తనదగ్గరకు వచ్చిన తరుణ్ భాస్కర్ చెప్పిన లైన్ బాగున్నట్టు అనిపించి ఇదే సినిమాగా ఎందుకు డెవలప్ చేయకూడదు అని అడిగాడట. దాని పేరు చార్లీ అని కూడా ప్రచారంలో ఉంది. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత ఈ నగరానికి ఏమైంది రూపంలో తరుణ్ భాస్కర్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. మరోవైపు ఆర్టిస్టుగా మారుతున్నాడు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలా మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం అంటే గుడ్ న్యూస్. ఇవన్ని ఓకే కాని అసలు మహేష్ మనసులో ఏముందో ఇంకో రెండు నెలల దాకా బయట పడే పరిస్థితి కనిపించడం లేదు. మహర్షి ఏప్రిల్ 25న విడుదల అయ్యాక కాని మౌనం వీడేలా లేడు మరి