Begin typing your search above and press return to search.

'బ్రహ్మోత్సవం' రీమేక్‌ ఏంటీ బాసు.. మతి పోయిందా?

By:  Tupaki Desk   |   18 April 2019 5:51 AM GMT
బ్రహ్మోత్సవం రీమేక్‌ ఏంటీ బాసు.. మతి పోయిందా?
X
మహేష్‌ బాబు కెరీర్‌ లో ఒకప్పుడు 'బాబీ' చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ మూవీ. ఆ సినిమా రికార్డును బ్రేక్‌ చేసి మరీ 'బ్రహ్మోత్సవం' చిత్రం డిజాస్టర్‌ మూవీగా నిలిచింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి విభిన్నమైన మల్టీస్టారర్‌ చిత్రాన్ని అందించి, ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకున్న శ్రీకాంత్‌ అడ్డాలను గుడ్డిగా నమ్మి మరోసారి ఒక మంచి ఫ్యామిలీ కథాంశంతో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో 'బ్రహ్మోత్సవం'ను మహేష్‌ బాబు చేశాడు. ప్రసాద్‌ వి పొట్లూరి వంటి పెద్ద నిర్మాత అవ్వడంతో బడ్జెట్‌ కూడా భారీగానే ఖర్చు చేశారు. కుటుంబ విలువలను తట్టి లేపే విధంగా ఈ చిత్రం ఉంటుందని ప్రచారం చేశారు. కాని సినిమా చూసే వారు నిద్ర పోతే తట్టి లేపే పరిస్థితి ఏర్పడింది.

'బ్రహ్మోత్సవం' వంటి సినిమాను మహేష్‌ బాబు ఎలా చేశాడంటూ అంతా కూడా అవాక్కవుతున్నారు. ఈ చిత్రంను తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా మహేష్‌ బాబు పరువు పోగొట్టడం అవసరమా అంటూ ఫ్యాన్స్‌ అనుకున్నారు. బ్రహ్మోత్సవం గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. త్వరలోనే తమిళ ఆడియన్స్‌ ముందుకు 'బ్రహ్మోత్సవం' చిత్రం రీమేక్‌ అయ్యి వెళ్లబోతుంది.

గతంలో ఆటోగ్రాఫ్‌, ఇంకా కొన్ని ఫీల్‌ గుడ్‌ మూవీస్‌ చేసిన చేరన్‌ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రం రీమేక్‌ కు ఏర్పాట్లు చేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చేరన్‌ ఈ విషయాన్ని వెళ్లడించాడు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి ఈ కథ చాలా దగ్గరగా ఉందని, తమిళ నేటివిటీకి తగ్గట్లుగా కథను మార్చి, చేస్తే తప్పకుండా తమిళంలో మంచి విజయాన్ని సాధించడంతో పాటు, ఫీల్‌ గుడ్‌ మూవీగా నిలుస్తుందనే అభిప్రాయంతో చేరన్‌ ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్నాడు, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం కూడా ఉంది. తెలుగు జనాలు మాత్రం చేరన్‌ నిర్ణయంకు షాక్‌ అవుతున్నారు. డిజాస్టర్‌ కా బాప్‌ వంటి సినిమాను రీమేక్‌ చేయడం ఏంటీ బాసు, మతిగాని పోయిందా చేరన్‌ కు అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో జోకులు వేసుకుంటున్నారు. మరి చేరన్‌ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.