Begin typing your search above and press return to search.

మహేష్ మూవీకి దిమ్మతిరిగే రేట్

By:  Tupaki Desk   |   19 Jan 2018 5:40 PM GMT
మహేష్ మూవీకి దిమ్మతిరిగే రేట్
X
మన స్టార్ హీరోల మార్కెట్ ఈ మధ్య చాలా పెరిగిపోతోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతుండడంతో సినిమాకు సంబంధించిన ప్రతి మ్యాటర్ లో నిర్మాతలకి కాసుల పంట పండుతోంది. సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ ఉన్నా సరే షూటింగ్ దశలోనే మొత్తం థ్రియేటికల్ రైట్స్ ఒప్పందాలు సెట్ అయిపోతున్నాయి. అలాంటి బిజినెస్ లు ఎక్కువగా మహేష్ బాబు సినిమాలకే జరుగుతుంటాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పోకిరి సినిమా నుంచి మహేష్ ప్రతి సినిమా సినిమాకి బిజినెస్ పెద్దదవుతూ వస్తోంది. గత కొంత కాలంగా ఉహించని విధంగా రెండు డిజాస్టర్స్ వచ్చినా సరే మహేష్ మార్కెట్ ఇప్పుడు కొంచెం కూడా డౌన్ అవ్వలేదు. అతని నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ భరత్ అనే నేను సినిమా తెరకెక్కుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు రీసెంట్ గా వచ్చిన శాటిలైట్ హక్కుల రేట్ గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. శ్రీమంతుడు కాంబినేషన్ కావడంతో బిజినెస్ హై రేంజ్ లో ఉంది. ఇప్పటికే ఆడియో హక్కులు రికార్డ్ స్తాయిలో అమ్ముడు పోగా స్టార్ మా శాటిలైట్ హక్కుల కోసం సినిమాకు మంచి ఆఫర్ ఇచ్చింది.

తెలుగు హిందీ లో కలిపి మొత్తంగా రూ.39 కోట్లను ఆఫర్ చేసిందట. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సినిమాకి ఈ స్థాయిలో ఆఫర్ రాలేదు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించబోతున్నాడు. మొత్తం రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుంది. త్వరలో సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించబోతోంది. ఇక స్టార్ మా తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ కి గాను 23 కోట్లను ఆఫర్ చేస్తుండగా.. హిందీ వెర్షన్ కి 16 కోట్ల ను ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. ఇక డివివి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.