మహేష్ మనసు మార్చుకుని వచ్చేస్తున్నాడు

Sat Jan 13 2018 15:06:25 GMT+0530 (IST)

ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యున్నారు. ఇప్పటికే సమ్మర్లో రావాల్సిన సినిమాల తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్లు వచ్చేస్తున్నాయి. నా పేరు సూర్య.. రంగస్థలం.. మహానటి.. 2 పాయింట్ ఓ.. ఇటువంటి సినిమాలన్నీ ఆల్రెడీ ఫస్ట్ లుక్స్ తో సర్పరైజ్ ఇచ్చాయి. అయితే మహేష్ బాబు అండ్ కొరటాల శివ డైరక్షన్లో వస్తున్న సినిమా తాలూకు ఫస్ట్ లుక్ మాత్రం రాలేదు. రావట్లేదని కూడా హింటిచ్చారు. కాని చూస్తుంటే ఇప్పుడు మనస్సు మార్చుకున్నారట.నిజానికి ఈ సినిమాకు సంబంధించి అసలు కనీసం పేరును కూడా ఇంతవరకు అధికారికంగా చెప్పలేదు. అసలు ఈ సినిమా టైటిల్ ''భరత్ అను నేను'' అనేది అవునా కాదా అనే విషయం కూడా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం జనవరి 15న సంక్రాంతి సందర్భంగా మహేష్ అండ్ కొరటాల సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వారి పీఆర్వో ద్వారా టాక్ బయటకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి? ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? తదితర సందేహాలన్నీ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సంక్రాంతి నాడు నివృత్తిచేసుకోవచ్చు. గెట్ రెడీ.

ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిష్టర్ గా నటిస్తున్నాడంటూ.. చాలా టాక్స్ వినిపించాయి. ఇకపోతే ఈ సినిమా కథకు గురించిన ఏదన్నా క్లూ సంక్రాంతికి ఇస్తారేమో చూడాలి. కొరటాల డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోంది.