Begin typing your search above and press return to search.

పార్టీ టైమ్ అంటున్న భరత్ టీం

By:  Tupaki Desk   |   23 April 2018 4:17 AM GMT
పార్టీ టైమ్ అంటున్న భరత్ టీం
X
ఎన్నాళ్లగానో హిట్ కొట్టాలని మహేష్ బాబు గట్టిగా ట్రయ్ చేస్తూనే ఉన్నాడు. క్రేజీ కాంబినేషన్లలో చేసిన సినిమాలు హైప్ తెచ్చాయే కానీ హిట్ తెచ్చిపెట్టలేదు. ఇన్నాళ్లకు అతడి కోరిక భరత్ అనే నేను సినిమా తీర్చింది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై అన్నిచోట్ల మంచి కలెక్షన్లు రాబడుతోంది.

మహేష్ ను యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా చూపించడం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. సినిమాకు ఓవరాల్ గా మంచి టాక్ రావడంతో ఇప్పుడు భరత్ అనే నేను టీం మొత్తం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం పనిచేసిన టీం మొత్తం ఈ సక్సెస్ ను సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఈవెంట్ కు సినిమా కోసం పనిచేసిన కోర్ టీం అంతా అటెండయ్యింది. ఇందులో హీరో మహేష్ చాలా యాక్టివ్ గా కనిపించడమే కాకుండా యూనిట్ సభ్యులందరితో నవ్వులు విరబూయించాడు.

కొరటాల శివ - మహేష్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తరవాత నుంచి మహేష్ కు సరైన హిట్ పడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అదే కాంబినేషన్ లో ఇదే భరత్ అనే నేను తో ఆ రేంజ్ హిట్ వర్కవుట్ అయింది. ఈ సక్సెస్ ఈవెంట్లో హీరోయిన్ కియారా అద్వాణీ లేకపోవడమే లోటుగా కనిపించింది..