Begin typing your search above and press return to search.

మహేష్ కు దక్కిన బెస్ట్ గిఫ్ట్!!

By:  Tupaki Desk   |   24 Jan 2017 1:49 PM GMT
మహేష్ కు దక్కిన బెస్ట్ గిఫ్ట్!!
X
మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ తో తమిళ్-తెలుగు బై లింగ్యువల్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో అహ్మదాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ అండ్ టీం.. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ చేస్తోన్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కుతుండగా.. ఇక్కడ కూడా యాక్షన్ సీక్వెన్స్ లనే పిక్చరైజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తన సంతోషంతో పాటు భావాలను కూడా అభిమానులతో పంచుకునే మహేష్.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నేషనల్ గాళ్ చైల్డ్ డే సందర్భంగా ట్వీట్ చేసిన మహేష్.. తన గారాల పట్టి సితార ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోతో పాటు 'నేను అందుకున్న అత్యుత్తమ బహుమతి సితార. తను నా సంతోషం.. తను నా ఆనందం.. తనను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. కూతుళ్లకు పేరెంట్స్ గా ఉండడం గర్వంగా భావించండి' అంటూ ట్వీట్ చేశాడు మహేష్.

టాలీవుడ్ సూపర్ స్టార్ తన ఫ్యామిలీకి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. కొడుకు గౌతమ్ ను ఎంతగా ప్రేమిస్తాడో.. అంతకు మించి కూతురు సితారను చూసుకుంటాడు. అలాగే మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలో సితారను చూస్తుంటే.. మహేష్ అంత గర్వంగా ఫీలవడం కరెక్టే అనిపిస్తుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/