Begin typing your search above and press return to search.

రాయలసీమలో మహేష్ బాబు క్యాంప్

By:  Tupaki Desk   |   20 Feb 2017 5:26 AM GMT
రాయలసీమలో మహేష్ బాబు క్యాంప్
X
మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా.. ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండా.. షూటింగ్ జరిపేస్తున్నారు. కేరక్టర్ గురించి కానీ.. స్టోరీ గురించి కానీ చిన్న క్లూ కూడా లీక్ కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఇక టైటిల్ విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. సంభవామి అనే పేరు బాగా ప్రచారం జరుగుతోంది కానీ.. దీనిపై కూడా క్లారిటీ. అహ్మదాబాద్ లో నెల రోజుల షూటింగ్.. తాజాగా ముంబైలో మూడు వారాలకు పైగా షూటింగ్ చేశారు. హీరో ఇంట్రడక్షన్ కు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను.. ముంబైలో చిత్రీకరించగా.. ఇప్పుడు మహేష్ అండ్ మురుగదాస్ టీం.. కడప జిల్లా జమ్మలమడుగులో వాలనుంది. ఈ నెల21 నుంచి జమ్మలమడుగులో ఒక క్విక్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మురుగదాస్ చిత్రాల మాదిరిగా సోషల్ మెసేజ్ కం యాక్షన్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉండే ఈ చిత్రం.. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. కోలీవుడ్ దర్శకుడు ఎస్ జే సూర్య.. నటుడు భరత్ లు నెగిటివ్ కేరక్టర్లలో కనిపించనుండగా.. హారిస్ జైరాజ్ అందించనున్న సంగీతం.. ఈ చిత్రానికి ఆకర్షణ కానుంది. మహేష్ సరసన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/