Begin typing your search above and press return to search.

కలిసొచ్చే కాలానికి మహేష్ వస్తాడా?

By:  Tupaki Desk   |   25 Jun 2018 4:06 AM GMT
కలిసొచ్చే కాలానికి మహేష్ వస్తాడా?
X

భరత్ అనే నేను హిట్ ఇచ్చిన ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ తన తరవాత సినిమాను వెంటనే ప్రారంభించాడు. ఇప్పటికి మహేష్ హీరోగా 24 సినిమాలు దాటాడు. ఈసారి చేస్తున్నది కీలకమైన మైలురాయి లాంటి సినిమా కావడంతో దాని గురించి ప్రత్యేకంగా కేర్ తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా ఓకే చేశాడు. ఈ మూవీ కోసం తన స్టయిల్ మార్చి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

మహేష్ 25వ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. నార్త్ లోని హిల్ స్టేషన్స్ లో షూటింగ్ సాగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిలిం మేకర్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ సినిమాలకు మంచి సీజన్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే టైమది. మహేష్ వరకు అది లక్కీ సీజన్. మహేష్ నటించిన సినిమాల్లో ఏప్రిల్ లో రిలీజైన పోకిరి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. లేటెస్ట్ హిట్ భరత్ అనే కూడా ఏప్రిల్ లోనే వచ్చింది. అందుకే అదే కరెక్ట్ టైమని నిర్మాతల ఆలోచనగా ఉందని తెలుస్తోంది.

మహేష్ 25వ సినిమాను ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు. దిల్ రాజు - అశ్వనీదత్ - పీవీపీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.