‘నాన్న మహేష్’ గురించి నమ్రత

Sun Jun 18 2017 15:38:50 GMT+0530 (IST)

మహేష్ బాబు తనకు మంచి భర్తే కాదు.. తన పిల్లలకు గ్రేట్ ఫాదర్ కూడా అంటోంది నమ్రత. తాను పిల్లల విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటానని.. కానీ మహేష్ మాత్రం పిల్లల విషయంలో చాలా స్వేచ్ఛ ఇస్తాడని.. పిల్లలకు నో చెప్పడమే అతడికి తెలియదని నమ్రత చెప్పింది. ఈ రోజు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రిగా మహేష్ ఎలా ఉంటాడో ఓ ఇంటర్వ్యూలో నమ్రత వివరించింది.పిల్లలు స్కూలుకి వెళ్లాల్సిన టైంలో ఆటలు ఆడుతుంటే నేను ఊరుకోను. అప్పుడప్పుడూ కొంచెం స్ట్రిక్టుగా కూడా ఉంటాను. కానీ మహేష్ అలా కాదు. ‘మీకు స్కూల్ కి వెళ్లాలని లేదా.. సర్లే వెళ్లొద్దు. మీకు ఆడుకోవాలని ఉందా.. ఆడుకోండి. నిద్ర వస్తుందా.. వెళ్లి పడుకోండి. బొమ్మలు ఏవైనా కావాలంటే వెళ్లి కొనుక్కోండి’.. ఇలా ఉంటుంది మహేష్ మాట. పిల్లలు ఏం అడిగినా... ‘ఎస్’ అనే చెబుతాడు. మహేష్ నోటి నుంచి ‘నో’ అనే పదమే రాదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు చూస్తాడు. ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకుంటాడు. కాకపోతే స్కూల్లో పేరెంట్స్ మీట్ లాంటి వాటికి రావడం కుదరదు. వాటికి నేను వెళ్తుంటాను. తప్పకుండా రావాల్సిందే అని గౌతమ్ అడిగితే మాత్రం ఆ ఈవెంట్ మిస్ కాడు’’ అని నమ్రత తెలిపింది.

మహేష్ కు అమ్మానాన్నల్ని మమ్మీ డాడీ అనడం ఇష్టం ఉండదని.. అతనలా చేయడని.. తన పిల్లల విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నాడని నమ్రత చెప్పింది. ‘‘పిలుపు విషయంలో మహేశ్ చాలా పర్టికులర్ గా ఉంటాడు. నాన్న అని పిలిపించు కోవాలన్నది తన నిర్ణయమే. అందుకే మొదట్నుంచీ మా పిల్లలకు అమ్మ-నాన్న అని పిలవడం అలవాటు చేశాం’’ అని నమ్రత తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/