Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ ఎలిమినేష‌న్ ఊహించిందే జ‌రిగింది...

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:23 AM GMT
బిగ్‌ బాస్ ఎలిమినేష‌న్ ఊహించిందే జ‌రిగింది...
X
ప్రతివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక సభ్యుడు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం బిగ్‌ బాస్ షో విజ‌య‌వంతంగా 12వ వారం కంప్లీట్ చేసుకుంది. అయితే ప్రతివారం ఏ కంటెస్టంట్స్ బయటకి వెళ్లిపోతాడో ప్రేక్షకులకు ముందే అర్ధమైపోతుంది. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న వరుణ్ - రాహుల్ - మహేష్ లలో...ఈసారి మహేష్ ఇంటి నుంచి బయటకు వెళ్తాడని అంతా ఊహించారు. అలా అందరూ ఊహించినట్లే బిగ్ బాస్ హౌస్ నుంచి మహేష్ ఎలిమినేట్ అయ్యాడు.

ఎలిమినేషన్ కంటే ముందు కింగ్ నాగార్జున ఇంటి సభ్యులతో సరదా టాస్క్ లు ఆడించారు. ఈ టాస్క్‌ ల మధ్యలో రాహుల్ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున...చివరిలో వరుణ్ సేఫ్ అని చెప్పి...మహేష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ముగ్గురిలో ముందుగా రాహుల్ సేఫ్ అని నాగ్ చెప్ప‌డంతో రాహుల్ ఆనందానికి అంతే లేదు. అయితే మహేష్ బయటకు వెళ్లిపోతుంటే మిగతా ఇంటి సభ్యులు ఎవరు పెద్దగా ఫీల్ అవ్వలేదు. నవ్వుతూనే బయటకు సాగనంపారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళుతోన్న కంటెస్టెంట్ల‌ను చూసిన చాలా మంది బాగా ఎమోష‌న‌ల్ అయ్యారు. వారితో అనుబంధం ఉన్న కంటెస్టెంట్లు గుక్క ప‌ట్టి ఏడ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. మ‌హేష్ విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఇక మహేష్ వెళుతూ..వెళుతూ బాబా కాళ్ళకు నమస్కారం చేసుకుని బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఇక స్టేజ్ మీదకొచ్చిన మహేష్ కు నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులు ఫోటోలు ఇచ్చి - వారిలో నెంబర్ 1 కంటెస్టంట్ ఫోటో బోర్డు మీద పెట్టాలని - మిగతవారి ఫోటోలని ఇష్టాన్ని బట్టి రెండు -మూడు అంతకంటే ఎక్కువ ముక్కలుగా చింపేయోచ్చని చెప్పారు.

దీంతో బాబా నెంబర్ 1 అని చెప్పి ఆయన ఫోటోని బోర్డు మీద అతికించి - మిగిలిన వారి ఫోటోలని మధ్యలో ఒక ముక్కగానే చింపి పలు కారణాలు చెప్పాడు. చివరికి వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్ ని శ్రీముఖి మీద వేశాడు. బిగ్ బాంబ్ ప్రకారం బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు శ్రీముఖి కిచెన్ లోని సామగ్రిని క్లీన్ చేయాల్సి ఉంటుంది.