Begin typing your search above and press return to search.

గురువుపై శిష్యుడి గెలుపు..హౌస్‌ కి కొత్త కెప్టెన్

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:34 AM GMT
గురువుపై శిష్యుడి గెలుపు..హౌస్‌ కి కొత్త కెప్టెన్
X
బిగ్ బాస్ హౌసుకి మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. గత వారం టాస్క్‌ లో విన్ అయ్యి వితికా తొలిసారి కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం కెప్టెన్ టాస్క్ గురువారం ఎపిసోడ్ లో జరిగింది. రెండు ఎపిసోడ్లు గా జరుగుతున్న క్రేజీ కాలేజ్ టాస్క్ లో భాగంగా మంచి ప్రదర్శన చేసిన ఒక టీచర్ - ఒక స్టూడెంట్ పేరు ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. దీంతో స్టూడెంట్స్ లో మెజారిటీ సభ్యులు టీచర్ గా బాబా భాస్కర్ ప్రదర్శన బాగుందని చెప్పారు. అటు టీచర్స్ గా ఉన్న బాబా - వితికా - వరుణ్ ఏకాభిప్రాయంతో విద్యార్ధిగా మహేశ్ పేరు చెప్పారు.

దీంతో ఈ హౌస్ లో గురు-శిష్యులుగా మెలుగుతున్న మహేశ్ - బాబాలు కెప్టెన్ టాస్క్ లో పోటీ పడ్డారు. కెప్టెన్ పోరులో భాగంగా.. బిగ్ బాస్ ‘ప్రచారమే ఆయుధం’ అనే ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం మహేశ్ - బాబా భాస్కర్‌ లు మిగిలిన ఇంటి సభ్యుల దగ్గరకు వెళ్లి తమని కెప్టెన్‌ గా గెలిపించాలని ప్రచారం నిర్వహించాలి. ఇక మిగతా ఇంటి సభ్యులు వీళ్ల ప్రచారం నచ్చితే తమ వద్ద ఉన్న దండను తీసి కంటెస్టెంట్స్ మెడలో వేయాల్సి ఉంటుంది.

ఇక టాస్క్ మొదలవ్వడమే మహేశ్ - బాబాలు ప్రచారం మొదలుపెట్టి..తాము కెప్టెన్ అయితే ఏం చేస్తాం అనేది ఒక్కో ఇంటి సభ్యునికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా మహేశ్ మెడలో వరుణ్ సందేశ్ - హిమజ - శివజ్యోతి - రాహుల్ - రవి - శ్రీముఖిలు దండలు వేయగా - బాబా భాస్కర్ మెడలో పునర్నవి - వితికాలు దండలు వేశారు. దీంతో ఎక్కువ దండలు వేయించుకున్న మహేశ్ ఇంటికి కొత్త కెప్టెన్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇలా గురువు మీద శిష్యుడు విజయం సాధించి కెప్టెన్ అయ్యాడు.