బజ్: శ్రీకృష్ణ అవతారంలో మహేష్

Thu Apr 20 2017 12:59:14 GMT+0530 (IST)

మహా భారతం సినిమా కోసం చాల మంది డైరెక్టర్లు కలలు కన్నారు. ఇంకా ముందు కూడా అది చాల మందికి అందని ద్రాక్షనే చెప్పాలి. ఎందుకంటే అందులో ఉన్నన్ని గొప్ప ట్విస్ట్ లు పాత్రలు మరే కథ లో వెతికినా దొరకవు. అలాంటి మన మహా భారతాని ఇప్పుడు మలయాళం డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ తీయబోతున్నారు అన్న విషయం కరారు అయింది. 1000 కోట్లు భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో  మొత్తం భారత్ దేశ  అగ్ర నటులు అందరు ఉండబోతున్నారు.

మహాభారతంలో ముఖ్య పాత్రధారి శ్రీకృష్ణుడు ఎవరు ధరిస్తారు అనేది ఒక చిక్కు ఏర్పడింది ఇప్పుడు. ఈ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ హిందీ నటుడు హృతిక్  రోషన్.. మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబులను అనుకుంటున్నారట. మహేష్ తన ఫిల్మ్ కెరీర్ లో ఎక్కడ జానపద చిత్రాల ఛాయలు కూడా లేవు. మహేష్ ఇది వరకు ఎప్పుడు నాకు ఫలానా పాత్రలు ఫై ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన సంధర్భాలు లేవు. కానీ హృతిక్  రోషన్ ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్రను చేయకపోతే.. ఖచ్చితంగా అది మహేష్ బాబుతో చేయించాలని అనుకుంటున్నట్లు దర్శకుడు శ్రీకుమార్ ఆశిస్తున్నాడు.

'రండమూజ్హం' అనే బుక్ ఆధారంగా స్క్రిప్ట్ రాసారు అని తెలియజేసాడు దర్శకుడు. భీముడు కోణంలో కథ చెప్పబడుతుంది. భీముడు పాత్రని మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ చేస్తాడట. ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ గా వాసుదేవన్ నాయర్ చేయడం జరుగుతుంది.  రెండు  భాగాలుగా తీయనున్న ఈ మహా కావ్యమునకు  ప్రముఖ బిజినెస్ మాన్  'బి ర్ శెట్టి' ఈ సినిమా నిర్మాత. ఇంతకీ మహేష్ శ్రీకృష్ణుడి పాత్రను చేస్తాడా?Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/