Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పాత్రలో మహేష్!!

By:  Tupaki Desk   |   17 Nov 2017 1:25 PM GMT
ఎన్టీఆర్ పాత్రలో మహేష్!!
X
మహేష్ అనగానే మన సూపర్ స్టార్ అనుకోకండి. ఇప్పుడు ఎన్టీఆర్ కేరక్టర్ కోసం వినిపిస్తున్న పేరు మహేష్ మంజ్రేకర్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ అంటూ.. ఒకటికి నాలుగు సినిమాలపై ప్రకటనలు వచ్చేసిన సంగతి తెలిసిందే. వీటిలో అన్నిటికంటే ముందుగా షూటింగ్ కూడా ప్రారంభించేసుకుంటున్న సినిమా లక్ష్మీస్ వీరగ్రంధం. దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కొన్ని రోజులుగా ఈ సినిమాపై తెగ హంగామా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ముహూర్తం షాట్.. ఎన్టీఆర్ సొంతూరిలో షూటింగ్ కోసం ప్రయత్నాలు.. ఇవన్నీ చూస్తే సినిమా ఓ షేప్ కి వచ్చేసిందని అనుకోవచ్చు. కానీ ఇప్పటివరకూ ఎన్టీఆర్ పాత్రకు కానీ.. లక్ష్మీ పార్వతి రోల్ కి కానీ ఎవరూ కన్ఫాం కాలేదు. లక్ష్మీ పార్వతి రోల్ కోసం గరుడవేగ హీరోయిన్ పూజా కుమార్ ను పరిశీలిస్తుండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర కోసం కూడా నటుడిని ఫైనల్ చేసేశారట. బాలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ అయిన మహేష్ మంజ్రేకర్ తో.. నందమూరి తారక రామారావు పాత్రను చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాడు కేతిరెడ్డి.

మహేష్ మంజ్రేకర్ ను ఇప్పటికే కలిసి స్టోరీ డిస్కషన్స్ చేయగా.. ఆయన కూడా ఎన్టీఆర్ పాత్రను పోషించేందుకు సిద్ధంగానే ఉన్నాడని చెబుతున్నాడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఒక్కడున్నాడు.. అదుర్స్.. అఖిల్ వంటి చిత్రాలతో ఇప్పటికే మహేష్ మంజ్రేకర్ తెలుగు ఆడియన్స్ కు కూడా తెలుసు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రను.. అది కూడా వివాదాస్పద చిత్రంలో చేసేందుకు అంగీకరిస్తాడా అన్నదే అసలు పాయింట్.