అవును.. చాలా బాధగా ఉంది..

Tue Jun 19 2018 16:11:06 GMT+0530 (IST)

ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది అంటే ఏ నిర్మాత అయినా ఒప్పుకోడు. ఆఖరికి నటీనటులు ఒప్పుకున్నా కూడా ప్రొడ్యూసర్ మాత్రమే చివరి నిమిషం వరకు సినిమా బాగా ఆడాలని చూస్తాడు. ఇకపోతే ఇటీవల కొందరు నిర్మాతలు విడుదలైన కొన్ని రోజులకే మా సినిమా డిజాస్టర్ అని ఒప్పేసుకుంటున్నారు. మొన్న రామ్ గోపాల్ వర్మతో ఆఫీసర్ చేసిన నిర్మాతతో పాటు ఇప్పుడు కళ్యాణ్ రామ్ నిర్మాత కూడా అదే తరహాలో ఆన్సర్ ఇచ్చాడు.ఎన్టీఆర్ పర్సనల్ పిఆర్ ఓ గానే కాకుండా ఎన్ని ఏళ్ళు మీడియాలో పని చేసిన అనుభవం ఉన్న మహేష్ కోనేరు నా నువ్వే సినిమా నిర్మించాడు. తమన్నా హీరోయిన్ గా చేసిన ఆ సినిమాకు జయేంద్ర దర్శకత్వం వహించారు. పూర్తిగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అయితే ఆ సినిమా విడుదలయిన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో మహేష్ కోనేరు సినిమా ఫెయిల్యూర్ ని ఒప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా  తెలిపాడు. ''అవును. చాలా బాధగా ఉంది. సినిమా నిరాశపరిచింది.  మా ప్రాణం పెట్టి తీసాం. అందరం చాలా కష్టపడ్డాం. మరో హిట్ కోసం ప్రయత్నిస్తాం.  సినిమా అంటే చాలా ఇష్టం. మమల్ని ఇంతదూరం తీసుకువచ్చింది అదే. నేడు ఫ్లాప్ వచ్చింది అంటే.. రేపు హిట్టు కోసం ఫైటర్ గా మారతాం. ఇంతకంటే మంచి సినిమా చేసే ప్రేక్షకులకు అందిస్తాం. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అని చెప్పాడు.

''ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మా ప్రయాణం ఆగదు'' అంటూ మహేష్ కోనేరు తెలియజేశాడు.