Begin typing your search above and press return to search.

​బిగ్ బాస్ నన్ను స్టార్ చేసింది

By:  Tupaki Desk   |   13 Aug 2017 5:21 PM GMT
​బిగ్ బాస్ నన్ను స్టార్ చేసింది
X
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు జనాలులో మంచి టాపిక్ అయ్యింది. అన్నీ వయసు వాళ్ళు చూసే ఒక టి‌వి షో గా మారింది. ఇందులో ఉన్న కంటెస్టంట్లు అందరూ ఇప్పుడు స్టార్లు అయ్యారు. ప్రతి రోజు బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళను చూస్తూ వీరికి కొంచం దగ్గరైయ్యారు మనవాళ్లు. అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం కొంతమంది ని బయటకు పంపడం వైల్డ్ కార్డ్ ను వాడి కొంతమందిని లోపలికి పంపడం జరుగుతూ ఉంటుంది. ఇలానే ఒక కంటెస్టంట్ మహేశ్ కత్తి ఒక ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చి మహేశ్ కత్తి సెలెబ్రిటీ అయిపోయాడు. అతనికి ఒక ఊహించని సంఘటన జరిగింది హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో.

బిగ్ బాస్ కి సినీ విమర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి 27 రోజులు పాటు ఉన్నాడు మహేశ్ కత్తి. శనివారం ఎలిమినేట్ అయిన మహేష్ కత్తి హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తను కనిపించగానే కొంతమంది గుర్తుపట్టి అతనితో సెల్ఫీలు తీసుకున్నారట. ఇదే విషయం మహేశ్ కత్తి ఒక మీడియాతో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. “ప్రపంచానికి కొన్ని రోజులు సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉండటం నా జీవితంలో ఒక మంచి అనుభవం. నేను చాలా కాలంగా సినిమాలలో పని చేస్తున్న గుర్తుపట్టని జనాలు ఇప్పుడు బిగ్ బాస్ షో వలన నన్ను గుర్తుపడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పాడు.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఇప్పుడే జనాలలోకి బాగా చేరుతునట్లుగా ఉంది. ఈ షో లో ఇప్పుడు కొత్త అందాలు రావడం అందులో ఉన్న కంటెస్టంట్లుతో కొత్త కొత్త పనులు చేయపించడం షో ఇప్పుడు విజయవంతంగా నడుస్తుంది. అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పుడు ఎవరు వస్తారు అనేది పెద్ద చర్చగా మారింది.