మహేష్ కు తండ్రిగా మరోసారి సంతోషం

Wed Mar 20 2019 10:57:32 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో తరుచూ తన ఆట పాటలతో వైరల్ అవుతూ వస్తుంది. చిన్నప్పటి నుండి కూడా మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షిస్తూ వస్తున్న సితార తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు తన సోషల్ మీడియా వాల్స్ పై కూతురు సితార 'బాహుబలి' సినిమాలోని మురిపాల ముకుంద పాటకు డాన్స్ వేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. 'వాట్ ఏ ట్యాలెంట్ మై సీత పాప' అంటూ మహేష్ బాబు వీడియోతో పాటు పోస్ట్ చేశాడు.మహేష్ బాబు పోస్ట్ చేసిన ఆ వీడియో ఫేస్ బుక్ ఇన్ స్టా ట్విట్టర్ అనే తేడా లేకుండా అంతటా కూడా తెగ చక్కర్లు కొడుతోంది. పాటకు తగ్గట్లుగా చక్కని స్టెప్స్ తో సితార డాన్స్ వేయడం అందరిని ఆకర్షిస్తుంది. చిన్న వయస్సులోనే ఇలా చక్కని స్టెప్పులతో డాన్స్ వేయడం అదుర్స్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తూన్నారు. సితార గతంలో కూడా తన స్టెప్పులతో అందరిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

సితార ఎనర్జి మరియు ఆమెకు డాన్స్ పై ఉన్న మక్కువ చూస్తుంటే మంచి నటిగా హీరోయిన్ గా నిలుస్తుందేమో అని ఇప్పటి నుండి సితార గురించి అభిమానులు అనుకుంటున్నారు. మహేష్ బాబు తన కూతురును హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని కొందరు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో సీత పాప గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.

For Video Click Here