Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు భాద్యత మాదే

By:  Tupaki Desk   |   1 Aug 2015 5:26 AM GMT
శ్రీమంతుడు భాద్యత మాదే
X
మన సినీ తారలని ఆరాధించే తీరు చూసి పైనున్న దేవుళ్ళు కూడా కుళ్లుకుంటారేమో.. ఆ స్థాయిలో మన సినీ అభిమానులు స్టార్స్ పై ప్రేమ కురిపిస్తుంటారు. కటౌట్లకు దండలు మొదలుకుని బర్త్ డే నాడు అన్నదానాలు, రక్తదానం ఓహో.. వాటి గురించి మరి చెప్పక్కర్లే. అలాంటిది అభిమాన హీరో సినిమా తెరమీదికి వస్తోందంటే ఇక భాద్యతంతా తమదే అన్నట్టు సినిమా ప్రచార భాద్యతలనూ నెత్తిమీద పెట్టుకుంటారు.

శ్రీమంతుడు ఆడియో వేదిక మీద మహేష్ ఈ సినిమా భాద్యత మీదే అన్నట్టు చెప్పారు. మహేష్ నోరు తెరిచి కానుక అడిగాడో లేదో అభిమానులు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. తాజాగా శ్రీమంతుడు ఇమేజ్ తో కూడిన టి-షర్టులు వేసుకుని అంతటా తిరుగుతూ తమ అభిమాన హీరో సినిమాని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళుతున్నారు. సినిమా బృందం కంటే వీరే నయం అని పోరపడేరు.. వారు చెయ్యల్సింది వారూ చేస్తున్నారు. మీడియా వేదికగా మొన్న దర్శకుడు కొరటాల శివ, నిన్న శృతి హాసన్ ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై వున్నారు.