కూతురు ప్రేమ పై తండ్రికి అనుమానం...!

Wed Dec 12 2018 10:40:05 GMT+0530 (IST)

బాలీవుడ్ లో ఈమద్య కాలంలో వరుసగా స్టార్ కపుల్స్ వివాహాలు అవుతున్నాయి. కొన్ని లవ్ అఫైర్స్ బయటకు వచ్చి అవి కాస్త అధికారిక అఫైర్స్ గా మారి పెళ్లికి సిద్దం అవుతున్నారు. ఇక కత్రీనా కైఫ్ తో సుదీర్ఘ ప్రేమాయనం సాగించిన రణబీర్ కపూర్ రెండేళ్ల క్రితం ఆమె నుండి విడిపోయిన విషయం తెల్సిందే. ఆమె నుండి విడిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన ఆయన గత కొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ గురించి బాలీవుడ్ ప్రముఖులతో పాటు అందరికి తెలిసి పోయింది.వచ్చే ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం బాలీవుడ్ లో జరుగుతుంది. ఈ సమయంలోనే ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ వారిద్దరు ప్రేమ గురించి స్పందించాడు. రణబీర్ కపూర్ మంచి వ్యక్తి. ఇద్దరు ప్రస్తుతం మంచి సమయంను గడుపుతున్నారు. వారిద్దరి ప్రేమ గురించి తెలియాలంటే పెద్ద మేదావి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వారిద్దరి ప్రేమ గురించి తెలిసి పోయింది. వారిద్దరు కలిసి సంతోషంగా ఉంటే నాకు సంతోషమే అంటూ మహేష్ భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలోనే వారి పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా... వారిద్దరి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందా వెళ్తే ఎప్పుడు వెళ్తుందనేది నేను చెప్పలేను. వారిద్దరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకు పోతారని నేను నమ్మకంగా చెప్పలేను. ఎందుకంటే ఈతరం యువతి యువకుల ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. వారి ఆలోచనలు ఏ సమయంలో ఎలా మారుతాయో చెప్పలేం కదా అంటూ తన కూతురు ప్రేమపై మహేష్ భట్ అనుమానం వ్యక్తం చేశాడు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని ప్రస్తుతానికి తాను కూడా బలంగా కోరుకుంటున్నట్లుగానే ఆయన పేర్కొన్నాడు.