Begin typing your search above and press return to search.

మహేష్ ఎక్కడా తగ్గట్లేదు!!

By:  Tupaki Desk   |   30 May 2016 5:45 AM GMT
మహేష్ ఎక్కడా తగ్గట్లేదు!!
X
సూపర్ స్టార్ మహేష్ బాబుకి బ్రహ్మోత్సవం దారుణమైన రిజల్ట్ ని మిగిల్చింది. ఏదో ఎక్స్ పెక్ట్ చేసి, రకరకాలుగా అంచనాలు వేసుకుని తీసిన సినిమాని.. ప్రేక్షకులు తిరగ్గొట్టారు. మరి బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ మార్కెట్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తక మానదు. శ్రీమంతుడు తర్వాత అమాంతం ఆకాశానికి చేరుకున్న మహేష్ స్థాయి.. బ్రహ్మోత్సవం పరాజయం తర్వాత ఏమయిందనే అంచనాలు పెరుగుతున్నాయి.

స్ట్రైట్ గా చెప్పుకుంటే.. ఒక సినిమాతో రేంజ్ తగ్గిపోయే స్థితిలో మహేష్ లేడని ఒప్పుకోవాలి. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో స్థానానికి పోటీలో ఉన్న మహేష్.. ఒక సినమా ఫెయిల్ అయినంత మాత్రాన మార్కెట్ తగ్గే అవకాశం లేదు. పైగా.. బ్రహ్మోత్సవం మిగిల్చే నష్టాలను తిరిగి చెల్లించేస్తుండడంతో.. తర్వాతి మూవీకి కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టమైపోతోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న మహేష్.. మరోవారంలో ఇండియాకి చేరుకుంటాడు. రాగానే మురుగదాస్ తో చేయనున్న ద్విభాషా చిత్రంపై ప్రకటన ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. కొత్త సినిమా సంగతులు మొదలయ్యాక.. బ్రహ్మోత్సవం ఇచ్చిన షాక్ ను అందరూ మర్చిపోవడం ఖాయమని చెప్పచ్చు.

అయినా ఒక్క సినిమా మార్కెట్‌ అతలాకుతలం అవ్వడానికి మహేష్‌ ఏమైనా 20 కోట్లను టచ్‌ చేస్తున్న చిన్న హీరోనా ఏంటి.. కాదుగా. ఖచ్చితంగా తదుపరి సినిమాను బడా రేంజులో ప్రొడ్యూస్‌ చేసి.. బడా రేంజులో హిట్టు కొడతాడనే ఆశిద్దాం.