Begin typing your search above and press return to search.

కుండబద్ధలు కొట్టి చెప్పాడు మహేష్‌

By:  Tupaki Desk   |   3 Aug 2015 6:26 AM GMT
కుండబద్ధలు కొట్టి చెప్పాడు మహేష్‌
X
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చరిత్రను తిరగరాసింది. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని వేటాడింది. ఇంకా వేట సాగుతూనే ఉంది. సరికొత్త రికార్డులతో షేకాడిస్తోంది. ఇలాంటి సినిమాని కొట్టే వేరొక సినిమా రావాలంటే దశాబ్ధాలు పడుతుందని అంతా భావిస్తున్నారు. అయితే దీనికి పూర్తి ఆపోజిట్‌ గా మాట్లాడి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాడు మహేష్‌. వస్తే రానివ్వండి. రికార్డులు కొడితే కొట్టనివ్వండి. మేం కూడా వాటిని అధిగమిస్తాం. ఇదంతా మంచికే అని జగమొండిలా మాట్లాడాడు. మహేష్‌ లోని కాన్ఫిడెన్స్‌ నిజంగానే ముచ్చట పడేలా ఉంది కదూ?

బాహుబలి కలెక్షన్లు ఒక రకంగా మన మంచికే. స్టార్లేమీ షేకవ్వరు. బాహుబలి అన్నికోట్లు వసూలు చేశాక ఏ సినిమా వచ్చినా మరో 10కోట్లు అదనంగానే వసూలు చేస్తుంది. ఇలాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత స్టార్ల సినిమాలకు 10 నుంచి 15కోట్లు అదనపు ఆదాయం పెరుగుతుంది. ఇన్నేళ్లలో నేను గమనించిన విషయం ఇది. మగధీర వచ్చిన తర్వాత టాలీవుడ్‌ సినిమా రేంజ్‌ పెరిగింది. బాహుబలి కొత్త మార్కెట్‌ ని ఓపెన్‌ చేసింది. ఇదో శుభ పరిణామం... అని తన మనసులో ఉన్న మాటను కుండబద్ధలు కొట్టి మరీ చెప్పాడు ప్రిన్స్‌.

మహేష్‌ ఇంత కాన్ఫిడెంటుగా ఎందుకు చెప్పాడంటే.. అతడు నటించిన శ్రీమంతుడు రేంజు కేవలం 60కోట్లు మాత్రమే. ఇప్పుడు ఆ చిత్రానికి 80 కోట్లు పైగా మార్కెట్‌ పలికింది. ఇదంతా బాహుబలి మానియా వల్లే. ఇందులో సందేహమే లేదు. ఓ తెలుగు సినిమా ప్రపంచ సినీయవనికపై గొప్ప విజయం సాధించింది అంటే అది మొత్తం తెలుగు సినిమా చరిత్రనే మార్చేస్తుంది అనడానికి ఇది సింపుల్‌ ఉదాహరణ. మునుముందు బాహుబలిని మించే ఓ అసాధారణ స్క్రిప్టు లో మహేష్‌ నటించి రికార్డుల్ని తిరగరాయడు.. అని అనుకోలేం కదా!

అవతార్‌ ఇన్‌ స్పిరేషన్‌ తో బాహుబలి తీసిన రాజమౌళి 'మ్యాట్రిక్స్‌', 'మిషన్‌ ఇంపాజిబుల్‌', 'మెన్‌ ఇన్‌ బ్లాక్‌' లాంటి సినిమాల ఇన్‌ స్పిరేషన్‌ తో ఓ సరికొత్త కథ రాసుకుని మహేష్‌ ని హీరోగా పెట్టుకుని బాహుబలిని మించిన వసూళ్లు తెస్తాడేమో! ఎవరూహించారు? ఏం జరగడానికైనా ఆస్కారం ఉంది.