Begin typing your search above and press return to search.

పవన్ ఎన్టీఆర్ వేరు.. మహేష్‌ వేరు

By:  Tupaki Desk   |   27 July 2017 6:52 AM GMT
పవన్ ఎన్టీఆర్ వేరు.. మహేష్‌ వేరు
X
మన స్టార్ హీరోలు అందరూ గత పదేళ్ళు గా స్థిరంగానే ఉన్నా వాళ్ళతో పని చేసే హీరోయిన్లు మాత్రం మారిపోతూ ఉన్నారు. ఒకే హీరోయిన్ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు అందరూతో కలిసి పని చేయడం కష్టంగానే మారిపోతుంది. కానీ కొన్నేళ్ళ కిందట టాప్ హీరోయిన్ గా మెరిసిన నటి భూమిక చావ్లా మాత్రం ఇప్పటి స్టార్ హీరోలుగా ఉన్న మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లతో ఎప్పుడో కలిసి పని చేసే అనుభవాన్ని దక్కించుకొంది. వారి గురించి చెబుతూ.. పవన్ అండ్ ఎన్టీఆర్ ఒక తరహా అయితే.. మహేష్ పూర్తిగా డిఫరెంట్ అంటూ చెప్పేసింది.

ఈ ముగ్గురు కెరియర్లోనే టాప్ సినిమాలు పవన్ - ఖుషీ , మహేశ్ బాబు – ఒక్కడు, ఎన్టీఆర్ – సింహాద్రి లలో భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఒక మీడియా ఇంటర్వ్యూ లో ఆమె ఈ ముగ్గురు గురించి ఒక ఆసక్తికర విషయం ఒకటి బయట పెట్టింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెట్ లో ఉన్న అందరి గురించి ఆలోచిస్తాడు అందిరిని గౌరవిస్తాడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా ఎన్టీఆర్ అయితే అతనిలో ఉన్న ఎనర్జి గురించి చెప్పాలి. ఆ ఎనర్జికి మనం అందుకోవాలి అంటే చాలా కష్ట పడవలిసి వస్తుంది అని చెప్పింది. ఈ ఇద్దరు గురించి అందరూ ఇలానే చెబుతారు కానీ మహేశ్ బాబు గురించి భూమిక కొన్ని గమత్తైన విషయాలు బయట పెట్టింది.

మహేశ్ అందరూ అనుకునేటట్లు సీరియస్ గా నెమ్మదిగా ఏమి ఉండడు. చాలా సరదా మనిషి. సెట్ కి వచ్చాడు అంటే సందడే సందడి. కామ్ గా వస్తాడు జోక్ వేసి ఏమి ఎరగనట్లు వెళ్ళిపోతాడు. అందరితో అలా ఉండడు అనుకోండి తనకు మనం కొంచం దగ్గర అయితే మాత్రం మహేశ్ ఫన్నీ బోన్ రుచి చూస్తాం అని చెబుతోంది. చాల కాలంగా సినిమాకు దూరంగా ఉన్న భూమిక మళ్ళీ ఎం యెస్ ధోని సినిమా తో హిందీలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తల్లి కూడా అయ్యింది. మళ్ళీ నేను నటించాలి అనుకుంటున్నాను అని కూడా చెబుతోంది. హిందీ లో అయితే అక్కగా చేసింది మరి తెలుగులో ఈ హీరోయిన్ కి ఎటువంటి పాత్రలు రాబోతున్నాయో చూద్దాం.