Begin typing your search above and press return to search.

మంచి ప్రొడక్టు, అందుకే ముందుకు - మహేష్‌

By:  Tupaki Desk   |   2 Aug 2015 4:22 AM GMT
మంచి ప్రొడక్టు, అందుకే ముందుకు - మహేష్‌
X

శ్రీమంతుడు ఆగస్టు 7న వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్స్‌ మహేష్‌ ప్రత్యేకంగా కొన్ని టిట్‌ బిట్స్‌ మాట్లాడాడు. అవి మీకోసం...

ఈ ఎగ్రెస్సివ్‌ ప్రమోషన్‌ కి కారణం?

మంచి ప్రొడక్ట్‌ చేతిలో ఉంది. ఇలాంటి ఉత్పత్తిని అందరికీ చేరువ చేయాలనే. ఎక్కువ మంది ఆడియెన్‌ ని థియేటర్‌ కి రప్పించాలనే ప్రయత్నమే.

సహనిర్మాతగా వ్యవహరించడానికి కారణం?

అన్నయ్య, అక్క ఇద్దరితో కలిసి గతంలోనూ సినిమాలు నిర్మించాను. కానీ అప్పటికి ఇప్పటికి ఒకటే తేడా. ఇప్పుడు నిర్మాతల్లో నా పేరు వేశారంతే.

శ్రీమంతుడు స్క్రిప్టు లో ఏం ఆకర్షించింది?

కొరటాల నా దగ్గరికి వచ్చి స్క్రిప్టు చెప్పినప్పుడు. విజయం నా చేతిలోనే ఉంది అనిపించింది. నా పాత్రని మలిచిన తీరు, ఆ పాత్రలో ఉద్వేగం ఆకట్టుకున్నాయి. డెప్త్‌ బావుంది. అందరికీ కనెక్టయ్యే చిత్రమిది.

కొరటాల తో వర్కింగ్‌ ఎక్స్‌ పీరియెన్స్‌?

నా క్యారెక్టర్‌ గురించి ముందే బోలెడన్ని సజెషన్స్‌ ఇచ్చాడు. వాటి ప్రకారం నన్ను నేను మలుచుకున్నా. యూనివర్శల్‌ అప్పీల్‌ వచ్చేలా ప్రయత్నించాం. నావెల్టీ కుదిరింది కాబట్టి షూటింగ్‌ ని ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాను.

శ్రుతి గురించి?

శ్రుతి టెర్రిఫిక్‌ పెర్ఫామర్‌. చక్కని ప్రతిభ ఉంది. మా పెయిర్‌ అందరికీ నచ్చుతుంది.

జగపతిబాబు పాత్ర గురించి?

ఆయన ఈ పాత్రకు అంగీకరించడం గొప్పతనం. తండ్రి కొడుకులుగా తెరపై ఫ్రెష్‌ అప్పీల్‌ కనిపిస్తుంది. జగ్గూ తో పనిచేయడం లవ్‌ లీ.

గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టున్నారు? ఇన్‌స్పిరేషన్‌ ఏంటి?

బావ జయదేవ్‌ సలహా మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. సినిమా ఇన్‌ స్పిరేషన్‌ ఏం లేదు. కో ఇన్సిడెన్స్‌ మాత్రమే.

తమిళ్‌ లోకి అనువదించడానికి కారణం?

కెమెరామేన్‌ మధీ ఇచ్చిన సలహా వల్లే. తమిళ్‌ లోకి మార్కెట్‌ ని విస్తరించమని సలహా ఇచ్చాడు. అందుకే అక్కడికి వెళ్లి నా సినిమాని బాగా ప్రమోట్‌ చేశా.

అపజయాలు ప్రభావం చూపించాయా? ఎలా బైటికొస్తారు?

అపజయం ప్రభావం చూపించడం సహజమే. తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకుని ముందుకు వెళ్తున్నా.

భజరంగి లాంటి మీనింగ్‌ ఫుల్‌ సినిమాలు చేయరా?

ప్రయత్నించాను గతంలో. నాని, 1నేనొక్కడినే, టక్కరిదొంగ ఆ తరహాలోనివే. కానీ ఫలితం బాలేదు. అయినా మంచి స్క్రిప్టు వస్తే ప్రయత్నిస్తా.