మహేష్ ని ఇలా ఎప్పుడైనా చూశారా?

Sat Nov 18 2017 15:08:17 GMT+0530 (IST)

మహేష్ బాబు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రమే కాదు. ఓ బ్రాండ్ కూడా. అప్పట్లో ఓ లిక్కర్ బేస్డ్ కంపెనీ ప్రకటనలో నటిస్తేనే ఎంతగా రచ్చ అయిందో ప్రత్యక్షంగా చూశాం. అయితే.. అంతకు ముందు కానీ.. తర్వాత కానీ మహేష్ ఎప్పుడూ ఫ్యామిలీస్ నుంచి వ్యతిరేకత ఫేస్ చేసే విధంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. మహేష్ చేతిలో ఓ సిగరెట్ కానీ.. మందు గ్లాస్ కానీ ఎన్నడూ కనిపించలేదు.అంతగా కుటుంబాలకు విలువ ఇచ్చే మహేష్ బాబు.. తన కుటుంబానికి కూడా అదే రేంజ్ విలువను ఇస్తాడు. పబ్లిక్.. ప్రైవేట్ బిహేవియర్ కూడా సూపర్ క్లీన్ అంటారు సన్నిహితులు. కానీ తాజాగా మహేష్ బాబు ఓ క్యాసినో గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్లుగా ఉన్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. పక్కనే మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ప్రొడ్యూసర్ రవి కూడా మహేష్ తో పాటు ఈ ఫోటోలో కనిపిస్తాడు. ప్రస్తుతం మన సూపర్ స్టార్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.

ఓ కూల్ డ్రింక్ కంపెనీ ప్రకటన కోసం అమెరికా  వెళ్లిన మహేష్.. లాస్ వెగాస్ లోని ఓ క్యాసినోకు వెళ్లగా.. అక్కడ క్లిక్ మనిపించిన ఫోటో ఇది. ఈ ఫోటో కూడా యాడ్ లో భాగమా అనుకోవచ్చు కానీ.. పక్కనే ఉన్న పర్సన్స్ ని చూస్తే ఇదేదో ప్రైవేట్ మీటింగ్ అనే సంగతి అర్ధమవుతుంది. సూపర్ స్టార్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.