మేనకోడళ్ల ఫంక్షన్లో మహేష్ మావయ్య

Sat Oct 21 2017 23:17:08 GMT+0530 (IST)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో ఒక హీరోగానే కాదు మంచి ఫ్యామిలీ పర్సన్ అని కూడా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువగా బయట విషయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళతారు. ఇక కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరిగినా మహేష్ సాధారణ వ్యక్తి లా ఒక బందువుగా వేడుకలో పాల్గొంటారు.రీసెంట్ గా తన మేనకోడలి సారి ఫంక్షన్ లో కూడా మహేష్ మావయ్య ఫ్యామిలీతో హాజరయ్యారు. చిన్నక్క మంజుల.. బావ సంజయ్ స్వరూప్ ల కూతురు హాఫ్ సారి ఫంక్షన్ ను వారి కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. వేడుకలో మహేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారనే చెప్పాలి. ఇక మహేష్ సతిమణి నమ్రత అలాగే వారి కుమారుడు గౌతమ్ ముగ్గురు వైట్ డ్రెస్ లో కూల్ గా కనిపించారు. సీనియర్ హీరో కృష్ణ కూడా వైట్ షర్ట్ లోనే కనిపించారు. ప్రస్తుతం మహేష్ భరత్ అను నేను సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ ఉన్నా కూడా బ్రేక్ తీసుకొని మరి మహేష్ మేన కోడళ్ల కోసం వచ్చినట్లు తెలుస్తోంది.

మహేష్ కి మేన కోడళ్లంటే చాలా ఇష్టమట. వారి ప్రతి పుట్టిన రోజు వేడుకలకు ఎదో ఒక గిఫ్ట్ తప్పనిసరిగా ఇస్తారట. తన పిల్లలతో సమానంగా అక్క పిల్లలని కూడా చూస్తాడట ఈ సూపర్ స్టార్. ఈ విషయం గత రాఖీ పండగకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంజుల వివరించారు.