పండగపూట ప్రిన్స్ ప్రిస్టేజ్ ఫిలిం షురూ

Sun Aug 13 2017 18:08:21 GMT+0530 (IST)

ఆచితూచి అడుగులు వేయటం. ఒక సినిమా చేయటం.. అది రిలీజ్ అయి.. దాని సక్సెస్సో.. ఫెయిల్యూరో ఫీల్ కావటం.. అందులో నుంచి బయటకు రావటానికి కనీసం మూడు నెలలు.. మ్యాగ్జిమమ్ ఆర్నెల్లు టైం తీసుకొని తీరిగ్గా మరోసినిమాకు కొబ్బరికాయ కొట్టటం. ఇదంతా ఏడాది కిందటి వరకే టాలీవుడ్ అగ్రహీరోలు చేసిందే.

కానీ.. ఇప్పుడు సీన్ మారింది. ఒక సినిమా తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయటం మొదలైంది. ఆ మాటకు వస్తే.. ఒక సినిమా చేస్తున్నప్పుడే.. మరో సినిమా చేయటం మామూలైంది. అగ్రహీరోలంతా ఇప్పుడు ఇదే బాట పడుతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు ముచ్చటే చూడండి ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్నారు. అంతలోనే కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను మూవీకి ఓకే చేసేయటమే కాదు.. షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి వేళ.. మరో మూవీకి ఓకే చెప్పేశారు.

కృష్ణాష్టమి పండగపూట మహేశ్ బాబు మైల్ స్టోన్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. టాప్ ప్రొడ్యూసర్స్ అశ్వినిదత్.. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అశ్వినిదత్ నిర్మాతగానే మహేశ్ హీరోగా రాజకుమారుడు (1999) చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు.అప్పటి నుంచి వారి మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయి. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తన సిల్వర్ జూబ్లీ మూవీకి అశ్వినిదత్ ఆయనే నిర్మాత కావటం విశేషం. సోమవారం (కృష్ణాష్టమి) పూజా కార్యక్రమాలతో ఈ ప్రిస్టేజియస్ మూవీ స్టార్ట్ కానుంది.