మహేశ్ మూవీ బిజినెస్ స్టార్ట్ చేయలేదెందుకు?

Sun Jan 08 2017 17:15:20 GMT+0530 (IST)

దారుణమైన బండ మీద పడ్డాక మహేశ్ కసిగా చేస్తున్న మురుగదాస్ మూవీ గురించి ఆసక్తికర ముచ్చట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా టైం చాలా ఉన్నప్పటికీ.. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తి కావొస్తుందని చెబుతున్నారు. ఈ పక్కా యాక్షన్ మూవీలో మురగదాస్ మార్క్ సీన్లు చాలానే ఉంటాయని చెబుతున్నారు. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయటం పక్కా అన్న టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా  బిజినెస్ ఇంకా ఓపెన్ చేయలేదు.

భారీ సినిమా చేస్తున్నప్పుడు వీలైనంత త్వరగా బిజినెస్ ను మొదలెట్టి.. సేఫ్ గా క్లోజ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ.. ఈ మూవీ విషయంలో నిర్మాతలు చాలా కూల్ గా ఉన్నారట. ఈ మూవీ ట్రైలర్ వచ్చాక సినిమా రేంజ్ పీక్స్ కు వెళుతుందని.. అప్పుడు బిజినెస్ ఓపెన్ చేస్తే.. క్యూలో నిలుచొని మరీ అమ్మేయొచ్చని వారు ఫీల్ అవుతున్నారట.

ఈ సినిమా కోసం మురగదాస్ రాసుకున్న సీన్లలో హైలెట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి చెబుతున్నారు. సింహాద్రి.. ఛత్రపతి సినిమాల్లో మాదిరి ఇంటర్వెల్ అదిరిపోతుందని.. ఆ బ్లాక్ మొత్తం ప్రేక్షకుడి మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఇంటర్వెల్ స్లాట్ సినిమాకే హైలెట్ అవుతుందని చెబుతున్నారు. మోస్ట్ ఎవైటింగ్ మూవీస్ లో ఒకటిగా చెబుతున్న ఈ సినిమా మీద వస్తున్న వార్తలు అదిరిపోతున్నాయి. మరి.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/