Begin typing your search above and press return to search.

పవన్ తర్వాత మహేష్-బన్నీల్లో ఎవరో..

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:30 PM GMT
పవన్ తర్వాత మహేష్-బన్నీల్లో ఎవరో..
X
టైటిల్ చూసేసి.. ఇదేదో టాలీవుడ్ స్టార్ హీరోల ర్యాంకింగ్ గురించి అనుకోకండి. ఇప్పటికైతే మనం జస్ట్ సినిమాలు.. వాటి రిలీజ్ డేట్ ల గురించే మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు రిలీజ్ డేట్ గురించి ఇంతకుముందే చెప్పేసుకున్నాం. ఇప్పుడు అఫీషియల్ గా కూడా కాటమరాయుడు విడుదల తేదీ మార్చ్ 29నే అని అనౌన్స్ అయిపోయింది. అయితే.. మన అసలు టాపిక్ ఏంటంటే.. పవర్ స్టార్ తర్వాత సినిమా రిలీజ్ చేయనుంది ఎవరు అనే?

పవన్ మార్చ్ 29న వస్తుంటే.. ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కానుంది. ఈ రెండు భారీ చిత్రాలు విడుదల తేదీల విషయంలో ఇప్పటికే ఫైనల్ గా ఫిక్స్. కానీ.. ఏప్రిల్ లో తమ సినిమాలు విడుదల చేస్తామని ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు., స్టైలిష్ అల్లు అర్జున్ లు కూడా చెప్పారు. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ (ఏజంట్ శివ అనే టైటిల్ అనుకుంటున్నారు) ఏప్రిల్ లోనే రానుండగా.. బన్నీ-హరీష్ శంకర్ సినిమా.. డిజె దువ్వాడ జగన్నాథమ్ కూడా ఏప్రిల్ అనే అంటున్నారు.

ఇప్పుడు పవన్ కాటమరాయుడు.. బాహుబలి మధ్యలో ఓ నెల రోజుల గ్యాప్ వచ్చింది. ఒక్కో పెద్ద సినిమాకి రెండు రోజుల గ్యాప్ కంపల్సరీ కాబట్టి.. ఏప్రిల్ రెండో వారంలో ఓ మూవీ విడుదలకు ఛాన్స్ ఉంది. మరి ఈ స్లాట్ ను బుక్ చేసుకునేది ఎవరనే సంగతే తేలాల్సి ఉంది. షూటింగ్ ప్రోగ్రెస్ ను బట్టి చూస్తే.. మహేష్ బాబుకే ఎక్కువ ఛాన్సులున్నాయ్ అనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/