Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ:భామల మధ్య బాలచంద్రుడు

By:  Tupaki Desk   |   18 July 2018 4:25 AM GMT
ఫోటో స్టోరీ:భామల మధ్య బాలచంద్రుడు
X
ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ టాలెంట్ పరంగా ఎవరికి వారిది ప్రత్యేక శైలి స్టైల్ ఉన్నా అమ్మాయిల ఫాలోయింగ్ విషయంలో మాత్రం మహేష్ బాబు ముందుంటాడు. యాపిల్ పండులా ఉండే మహేష్ మీద క్రేజ్ గురించి ఏకంగా అష్టాచెమ్మా సినిమాలో కథ మొత్తం ఈ పాయింట్ మీదే నడిపించాడు దర్శకుడు ఇంద్రగంటి. మహేష్ అనే పేరులో ఉండే మేజిక్ అదే. దానికి తోడు సినిమా సినిమాకు ఇంకా యంగ్ గా మారుతున్న ప్రిన్స్ గ్లామర్ రహస్యం ఏమిటో అర్థం కాక ఫాన్స్ కూడా తెగ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా క్లోజ్ అప్ యాడ్ లో నటించిన మహేష్ బాబు అందులో నటించిన టీమ్ తో పాటు యూనిట్ మెంబెర్స్ అందులోనూ ప్రత్యేకంగా అమ్మాయిలతో దిగిన ఫోటో వైరల్ అవుతోంది. సాలిడ్ కూల్ లుక్ తో మహేష్ ని చూస్తుంటే రెండు కళ్ళు చాలవంటున్నారు ఫాన్స్. ఫోటో చూస్తేనే ఇలా ఉంటే అక్కడ నిజంగా పక్కన నిలుచున్న అమ్మాయిలకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.

మహేష్ ని బాలచంద్రుడు అన్నది కూడా అందుకే. చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ నటించిన చివరి సినిమా అదే. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని రాజకుమారుడుతో హీరో అయ్యాడు. అయినా అందంలో ఇప్పటికీ మహేష్ బాలచంద్రుడే. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ సెలబ్రిటీగా అత్యధిక ప్రమోషన్స్ లో భాగమైన మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తన 25వ సినిమాను గ్యాప్ లేకుండా చేసేస్తున్నాడు. విడుదల వచ్చే ఏడాది అయినప్పటికీ బడ్జెట్ దృష్ట్యా కథ ప్రకారం షూటింగ్ కి చాలా సమయం కావాల్సి ఉండటంతో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఇలా చిన్నపాటి గ్యాప్స్ వచ్చినప్పుడు యాడ్స్ పని కానిచ్చేస్తున్నాడు.

యాడ్స్ లోనే ఇలా ఉంటె రేపు సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా బిజినెస్ మెన్ గా ఇంకెంత రచ్చ చేయబోతున్నాడో ఊహించుకుని ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు ఫాన్స్. ఒకప్పుడు రాజేష్ ఖన్నా శోభన్ బాబు లాంటి హీరోలకు ఇంత అరుదైన లేడీ ఫాలోయింగ్ ఉండేది. కానీ మాస్ తక్కువగా ఉండేవారు. కానీ మహేష్ వాళ్లకు భిన్నంగా ఇటు మాస్ తో పాటు మహిళా అభిమానులను కూడా భారీగా పోగేసుకోవడం విశేషమేగా. వచ్చే నెల 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 25వ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. టైటిల్ ఖరారు కావాల్సి ఉంది.