Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఏడు అవ‌తారాలు

By:  Tupaki Desk   |   28 July 2015 7:10 AM GMT
మ‌హేష్ ఏడు అవ‌తారాలు
X
కొన్ని సినిమాల్లో క‌థ‌లు ఆక‌ర్షిస్తుంటాయి. మ‌రికొన్ని సినిమాల్లో విజువ‌ల్స్ ఆక‌ర్షిస్తుంటాయి. కొద్దిమంది హీరోలు చేసే ఫైట్లు కానీ లేదంటే కొద్దిమంది హీరోలు చేసే డ్యాన్సులు కానీ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంటాయి. కానీ మ‌హేష్‌ బాబు సినిమాలో మాత్రం ఆయ‌న అంద‌మే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటుంది. ఇత‌రత్రా ఆక‌ట్టుకొనే విష‌యాలు ఎన్నున్నా వాట‌న్నిటికంటే మ‌హేష్ అందమే హైలెట్ అవుతుంటుంది. అలాంటి అంద‌గాడికి మ‌రికొన్ని హంగులు కూడా తోడైతే... తెర‌పై ర‌క‌ర‌కాల రూపాల్లో ఆయ‌న్ని చూపిస్తే అభిమానుల‌కు పండ‌గే క‌దా మ‌రి! కొర‌టాల శివ `శ్రీమంతుడు`లో మ‌హేష్‌ ని ఏడు అవ‌తారాల్లో చూపించాడ‌ట‌. ఆయ‌న లుక్కుల‌న్నీ లెక్క‌పెడితే ఏడు క‌నిపిస్తాయ‌ట‌. `శ్రీమంతుడు`కి ఆ లుక్కుల‌న్నీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ గా నిల‌వ‌బోతున్నాయ‌ని సినిమా వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌హేష్‌, శ్రుతిహాస‌న్‌జంట‌గా న‌టించిన `శ్రీమంతుడు` ఆగ‌స్టు 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టిదాకా విడుద‌లైన టీజ‌ర్‌ నీ, ట్రైల‌ర్ల ని బ‌ట్టి చూస్తే మ‌హేష్ రెండు మూడు అవ‌తారాల్లోనే క‌నిపించాడు. బిజినెస్ మేగ్నెట్‌ గా, కాలేజీ స్టూడెంట్‌ గా, సైకిల్ వేసుకొని ఊళ్లో తిరుగుతూ ప్లే బాయ్‌ లా క‌నిపించాడు. సినిమాలోమాత్రం మ‌రో నాలుగు లుక్కులు ఉంటాయ‌ట‌. ఓ లుక్కులో లుంగీ క‌ట్టుకొని మ‌రో లుక్కులో మ‌రో ర‌కంగా మ‌హేష్ సంద‌డి చేస్తాడ‌ని స‌మాచారం. సినిమా విదేశాల్లో మొద‌లై ప‌ల్లెటూరికి చేరుతుంది కాబ‌ట్టి క‌థ రీత్యానే ఆ లుక్కులు అవ‌స‌ర‌మ‌య్యాయ‌ట‌. ఇప్పుడు అవే సినిమాకి ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నాయ‌ట‌. నిజానికి ఇన్ని వేరియేష‌న్స్‌ లో మ‌హేష్ ఎప్పుడూ క‌నిపించ‌లేదు. అప‌ర కుబేరుడి కొడుకుగా మ‌హేష్ తెర‌పై చేసే సంద‌డి ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.