వైఎస్ జగన్ కు మహేష్ సర్ ప్రైజ్

Fri May 24 2019 16:28:12 GMT+0530 (IST)

ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సంచలన విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 151 సీట్లతో ప్రత్యర్థులకు అందనంత మెజార్టీని సాధించారు. ఈ అద్భుత విజయం వేళ.. జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ను అభినందించారు. శుక్రవారం మహేష్ ట్వీట్ చేస్తూ ‘జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని  ఆకాంక్షించారు.’.. ఏపీలో అఖండ మెజార్టీని సాధించిన వైఎస్ జగన్ కు నా ప్రత్యేక అభినందనలు.. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలను అందుకోవాలని.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

ఇక కేంద్రంలో క్లియర్ కట్ మెజార్టీ సాధించి రెండోసారి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్రమోడీని కూడా మహేష్ ట్వీట్ లో శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన విజయాన్ని సాధించిన మీరు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో మీ  నాయకత్వంలో నడిపించాలని కోరుకున్నానని తెలిపారు.