Begin typing your search above and press return to search.

బ్యాక్ టు ఒరిజినల్ మహేష్

By:  Tupaki Desk   |   16 July 2018 5:56 AM GMT
బ్యాక్ టు ఒరిజినల్ మహేష్
X
ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను సక్సెస్ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నాడు. దీని తర్వాతే తన 25వ సినిమా కావడంతో ఫాన్స్ కూడా మాంచి కిక్ మీదున్నారు. కాకపోతే షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభించడంతో విడుదల వచ్చే ఏడాది ఉండబోతోంది. ఆ మేరకు ఏప్రిల్ 5 డేట్ కూడా చెప్పేసారు కాబట్టి ఇక ఆ విషయంలో ఎలాంటి సస్పెన్స్ కు అవకాశం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విశేషం అభిమానులను బాగా ఎగ్జైట్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గా కనిపించేది అన్నింటికన్నా ముఖ్యమైనది. ఇటీవలే డెహ్రాడూన్ లో 24 రోజుల పాటు కీలక తారాగణం మొత్తం పాల్గొనగా షూట్ చేసింది ఈ సన్నివేశాలే. మామూలుగానే వయసుతో సంబంధం లేకుండా యంగ్ గా కనిపించే మహేష్ ని ఇంకా యూత్ ఫుల్ గా చూపించడం కోసం వెరైటీగా గెడ్డం మీసం పెంచేలా చేసి దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన ప్రయత్నం మంచి ఫలితం ఇచ్చింది, కాకపోతే ఇది కేవలం సినిమాకు సంబంధించి ఒక ఎపిసోడ్ కు మాత్రమే కాబట్టి ఆ లుక్ అంతటా ఉండదు.

ఆ పార్ట్ పూర్తయిపోయింది కాబట్టి మహేష్ మళ్ళి తన రెగ్యులర్ లుక్ లోకి వచ్చేసాడు. పూర్తిగా తీసేయడం అని కాదు కానీ లుక్ పరంగా చాలా మార్పు కనిపించేలా మొత్తం ట్రిమ్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ లో ఒక షో రూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఫ్రెష్ గా కనిపించాడు మహేష్ అల్లరి నరేష్ మహేష్ కు ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. కాలేజీ లైఫ్ లో తాము కనిపెట్టిన ఒక రైతు సమస్య గురించి లింక్ పెట్టి చాలా కొత్తగా అనిపించే కాన్సెప్ట్ తో మహేష్ నరేష్ మధ్య పాత్రలను తీర్చిదిద్దినట్టు వినికిడి. కీలకమైన పార్ట్ కోసం త్వరలో అమెరికా బయలుదేరనున్న టీమ్ అక్కడ రెండు నెలలు తక్కువ కాకుండా భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. కథ ప్రకారం అక్కడ షూట్ చేయాల్సిన భాగం చాలా ఉందట. రైతు సమస్య-ప్రాణ స్నేహితులు-అమెరికా బ్యాక్ డ్రాప్-కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా ఆసక్తిగా కనిపిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేసే అవకాశం ఉంది. టైటిల్ ప్రకటిస్తారా లేదా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.