Begin typing your search above and press return to search.

మరో ఘనత సాధించిన మహేష్

By:  Tupaki Desk   |   22 July 2018 10:50 AM GMT
మరో ఘనత సాధించిన మహేష్
X

ఒక్కో జెనరేషన్ కి ఒక్కో సూపర్ స్టార్ ఉంటాడు. తెలుగులో మాత్రం ఇప్పుడు సూపర్ స్టార్ మాత్రం మహేష్ బాబు. తెలుగులో మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మహేష్ ఫాలోయింగ్ సౌత్ అంతా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. ఒక్క తెలుగులోనే కాదు మహేష్ క్రేజ్ ఇప్పుడు చాలా చోట్ల భీభత్సంగా ఉంది. రీసెంట్ గా ఈ విషయంలో ఒక పెద్ద రికార్డు సృష్టించాడు.

ఇప్పటి జెనరేషన్ స్టార్లందరూ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. మహేష్ కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్స్టా గ్రామ్ లలో చాలా యాక్టివ్. ఇలా అన్నీ ప్లాట్ ఫామ్ లను కలిపి తీసుకుంటే మహేష్ ఫాలోయింగ్ 13 మిలియన్లు దాటిందట. సౌత్ లో ఈ రేంజ్ ఫాలోయర్లు కలిగి ఉన్న స్టార్ ఒక్క మహేష్ బాబు మాత్రమే. డీటెయిల్స్ తో చెప్తే.. ట్విట్టర్ లో 6.6 మిలియన్ ఫాలోయర్లు, ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్.. ఇక ముఖచిత్రంలో..అదేనండీ ఫేస్ బుక్ లో 5.1 మిలియన్ ఉన్నారు. ఈ భారీ ఫాలోయింగ్ తో సౌత్ లో సోషల్ మీడియా ఫాలోయింగ్ లో ఘనులైన ధనుష్ - అల్లు అర్జున్ - ప్రభాస్ లను వెనక్కు నెట్టాడు.

మరోవైపు మహేష్ ప్రస్తుతం తన కెరీర్లో 25వ చిత్రంలో నటిస్తున్నాడు. #SSMB25 వ్యవహరించే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మరో తెలుగు హీరో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.