Begin typing your search above and press return to search.

మే 20 అనే మాట.. మహేష్‌ చెబుతాడు

By:  Tupaki Desk   |   6 May 2016 4:47 AM GMT
మే 20 అనే మాట.. మహేష్‌ చెబుతాడు
X
ఈ సమ్మర్ లో అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మూడు సినిమాలు.. సర్దార్‌.. సరోనోడు.. అండ్‌ ''బ్రహ్మోత్సవం''. సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల రూపొందిస్తున్న ఈ సినిమా ఒక్కటే ఇక రిలీజ్‌ కావల్సి ఉంది. అయితే రిలీజ్ డేట్‌ ఎప్పుడా అనే ఉత్కంఠ ఇంకా ప్రేక్షకుల్లో ఉండనే ఉంది.

అయితే మే 20న బ్రహ్మోత్సవం రిలీజ్ చేయడానికి మహేష్‌ బాబు తన శాయశక్తులా ప్రయత్నం చేసి.. తన టీమ్‌ అందరితోనూ రేయింబవళ్లూ పనిచేయించి.. సదరు డేట్‌ ను అందుకునేలా కష్టపడుతున్నాడే విషయం తెలిసిందే. అయితే ఇదే డేట్‌ ను దాదాపు కన్ఫామ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్‌ తప్పిస్తే.. దాదాపు అందరు ఆర్టిస్టులూ ఫస్టాఫ్‌ డబ్బింగ్‌ పూర్తి చేశారట. కేవలం సెకండాఫ్‌ వర్క్‌ మాత్రమే మిగిలి ఉంది. అలాగే మిక్కీ జె మేయర్ కూడా రీ-రికార్డింగ్‌ చాలా వరకు పూర్తి చేశాడని అంటున్నారు. పైగా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కోసం మణిశర్మ మరోసారి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం షూటింగ్‌ మొత్తం పూర్తయినట్లే. కాకపోతే మహేష్ - సమంత - నాజర్‌ - వెన్నెల కిషోర్‌ పై రామోజీ ఫిలిం సిటీలో కొన్ని మాంటేజ్‌ లు చిత్రీకరిస్తున్నారు. అయితే మే 20న రిలీజ్‌ అనే విషయం ఎప్పటిలాగానే ఆడియో ఫంక్షన్‌ లో స్వయంగా మహేష్‌ ప్రకటిస్తాడట.