Begin typing your search above and press return to search.

కంట తడి పెట్టుకునేలా చేశాడు మహేష్‌

By:  Tupaki Desk   |   25 April 2019 5:31 AM GMT
కంట తడి పెట్టుకునేలా చేశాడు మహేష్‌
X
సహజ నటిగా పేరు దక్కించుకున్న సీనియర్‌ హీరోయిన్‌ జయసుధ ప్రస్తుతం టాలీవుడ్‌ లో అమ్మ పాత్రలకు పెద్ద దిక్కు అయ్యింది. స్టార్స్‌ కు అమ్మ పాత్రలో జయసుధను ఎక్కువగా ఎంపిక చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మహేష్‌ బాబుకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మరియు 'బ్రహ్మూెత్సవం' చిత్రాల్లో అమ్మ పాత్రను చేసిన జయసుధ తాజాగా 'మహర్షి' చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రంలో కూడా జయసుధ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహర్షి చిత్ర షూటింగ్‌ అనుభవాలను జయసుధ చెప్పుకొచ్చారు.

జయసుధ మాట్లాడుతూ... మహేష్‌ నేను హీరోయిన్‌ గా నటించిన సినిమాలో బాల నటుడిగా చేశాడు. అందుకే అప్పటి నుండే నాకు మహేష్‌ తెలుసు. చాలా మంచి వ్యక్తి, ఎంత పెద్ద స్టార్‌ అయినా ఏమాత్రం గర్వం ఉండదు. పెద్దలను గౌరవించడంతో పాటు, చాలా నిజాయితీగా మాట్లాడతాడు, ఉంటాడు. అతడితో నటిస్తున్న సమయంలో చాలా కంఫర్ట్‌ గా ఉంటుంది. విజయ నిర్మల గారు నాకు బందువు అవ్వడం వల్ల కృష్ణ గారి ఫ్యామిలీతో చాలా ఏళ్లుగా సన్నిహిత్యం నాకు ఉంది. ఆ అనుబంధం వల్ల మహేష్‌ ను ఎక్కువగా కలవడం జరిగింది. మహేష్‌ ఏ సినిమా చేసినా దాన్ని తన మొదటి సినిమానే పరిగణించి చేస్తూ ఉంటాడు. దర్శకుడు ఏది చెప్తే అది ఇచ్చేందుకు చాలా కష్టపడుతూ ఉంటాడు. దర్శకుడు ఎలా మల్చుకోవాలనుకుంటే మహేష్‌ అలా మారిపోతాడు.

ఇక మహర్షి చిత్రంలో మహేష్‌ బాబు నటన తారా స్థాయికి వెళ్లింది. రెండు మూడు సీన్స్‌ లో మహేష్‌ బాబుతో యాక్టింగ్‌ చేసే సమయంలో అతడి యాక్టింగ్‌ చూసి నేను ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వడం మర్చి పోయాను. నాకు కంట తడి పెట్టించాడు. మహేష్‌ యాక్టింగ్‌ కు సెట్స్‌ లోనే కన్నీరు పెట్టుకున్నాను. అంతగా పాత్రలో ఒదిగి పోయి నటించాడు. మహర్షి చిత్రంలోని నటనకు గాను మహేష్‌ బాబుకు అవార్డు రావడం ఖాయం అంటూ జయసుధ చెప్పుకొచ్చారు.

మహేష్‌ 25వ చిత్రంగా రూపొందిన 'మహర్షి' చిత్రం వచ్చే నెల 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రంను దిల్‌ రాజు, అశ్వినీదత్‌, పీవీపీలు నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్‌ మరియు ప్రకాష్‌ రాజ్‌ లు నటించారు. మే 1న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు.