Begin typing your search above and press return to search.

ఫోకస్‌: ఈ కొత్త ఫార్మాట్ వస్తే సూపర్

By:  Tupaki Desk   |   4 Aug 2015 3:38 AM GMT
ఫోకస్‌: ఈ కొత్త ఫార్మాట్ వస్తే సూపర్
X
హాలీవుడ్ లో తీసే వేల కోట్ల బడ్జెట్ కలిగిన సినిమాలు కూడా అదే 100 రూపాయల టికెట్ కు దొరుకుతున్నాయి. ఇక మనోళ్ళు ఒక 40-50 కోట్ల బడ్జెట్లో తీసే సినిమాల టిక్కెట్ ధర కూడా అంతే. అందుకే మన దేశంలో లోకల్ సినిమాలకంటే హాలీవుడ్ సినిమాలకు ఇన్-కం పెరుగుతోంది మరి. దీనికితోడు మార్కెట్ పెరగిందని హీరోల బడ్జెట్ పెంచేస్తే, ఫైనల్ గా నిర్మాతకు తడసి మోపెడు అవుతోంది. సగం పెట్టుబడి హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కే పొతే ఇక సినిమా ఏం పెట్టి తీస్తారు? అందుకు విరుగుడుగా ఒకప్పుడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, అలాగే మెగాస్టార్ చిరు వంటి దిగ్గజాలు ఫాలో అయ్యిన ప్రిన్సిపల్ ఒకటి ఆచరణలో పెట్టాడు మహేష్ బాబు. అందరూ ఇది ఫాలో అయితేనే బెటరేమో.. లెటజ్ సీ..

మహేష్‌ హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమానే తీసుకుంటే ఈ సినిమా తెరకెక్కడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. మహేష్‌ తాను తీసుకునే 20కోట్ల పారితోషికాన్ని ఆ సినిమాకి పెట్టుబడిగా పెట్టి వాటాదారుడయ్యాడు. సహనిర్మాతగా పేరు వేసుకున్నాడు. ప్రొమోషన్స్ బరువు నెత్తిన వేస్కున్నాడు. దాదాపు 40కోట్లు పెట్టుబడి పెట్టాక కూడా మరో 20కోట్లు హీరో పారితోషికంగా ఇవ్వడం కాసింత భారమైన పరిస్థితే. నిర్మాత అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అంతేకాదు స్టార్‌ హీరో పారితోషికమే 20కోట్లు ఉంటే, పూరి లాంటి స్టార్‌ హీరో మరో 10 నుంచి 15కోట్లు తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆ ఇద్దరి కలయికలో సినిమా తెరకెక్కాలంటే 30+40కోట్లు అవసరం. అప్పుడు పారితోషికాలు చెల్లించడానికి నిర్మాత అప్పుల్లో పడి మునిగిపోయే పరిస్థితి.

సో, నిర్మాత సేవ్ అవ్వలి.. సినిమా హిట్ అయితే ఈ టెక్నీషియన్లకు ఎక్కువ లాభాలూ రావాలి. అందుకే సినిమా నిర్మాణంలో పెట్టుబడులుగా మలిస్తే అది ఆ సినిమాకి మంచి చేసేదే అవుతుంది. అంటే ఆ సినిమా జయాపజయాల్లో సదరు హీరో, దర్శకుడు భాగస్వాములు అయినట్టు. ఈ ఫార్ములాకి శ్రీమంతుడు చిత్రంతో హీరో మహేష్‌ తెరతీశారు. ఇది శుభ పరిణామం. ఇప్పుడు స్టార్‌ హీరోల్ని కూడా భాగస్వాముల్ని చేస్తే సగం భారం నిర్మాత నెత్తిమీది నుంచి కిందికి దిగినట్టే. అలాగే కోటి పారితోషికం అందుకునే కథానాయికల్ని కూడా వాటాదారుల్ని చేసేస్తే ఇంకాస్త రిలాక్స్ అవ్వోచ్చు మన నిర్మాతలు. ఆ మేరకు బరువు దిగినా మంచికే. అలా కాకుండా ముందే నిర్మాత డబ్బు సంచుల్ని సదరు హీరో, డైరెక్టర్‌ కి ముట్ట చెప్పాలంటే రిలయన్స్‌ అంబానీలు, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోలకే సాధ్యం. మన నిర్మాతల వల్ల రానున్న రోజుల్లో కుదరని పరిస్థితి. బడా నిర్మాతలైన సురేష్ బాబు, దిల్ రాజు చిన్న సినిమాలు తీస్కుంటూ ఉండటానికి ఇదే ఓ కారణం.

అందుకే ఈ నయా ఫార్ములాని మన స్టార్‌ హీరోలందరికీ, స్టార్‌ డైరెక్టర్లందరికీ వర్తింపజేస్తూ ఓ ప్రత్యేకమైన రూల్ తెచ్చేస్తే బెటరేమో. దానికి నిర్మాతలమండలి, దర్శకసంఘం, మా అసోసియేషన్‌ సహా అందరి నుంచి ప్రోత్సాహం కావాలి. ప్రస్తుతం టాలీవుడ్‌ లో అరడజను పైగానే స్టార్‌ హీరోలున్నారు. కోట్లలో పారితోషికం తీసుకునే హీరోలందరినీ ఈ ఫార్మాటులోకి తీస్కొస్తే ఇక స్టార్ల సినిమాలకు బడ్జెట్ కరువు అనేదే రాదు.