Begin typing your search above and press return to search.

స్పైడర్.. 200 కోట్లా?

By:  Tupaki Desk   |   26 July 2017 7:47 AM GMT
స్పైడర్.. 200 కోట్లా?
X
ఏడాది కిందటి వరకు తెలుగు సినిమాలకు రూ.100 కోట్ల బిజినెస్ అంటేనే ఆశ్చర్యంగా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ల సినిమాల బిజినెస్ లెక్కలు అమాంతం పెరిగిపోయాయి. వంద కోట్లు అన్నది చిన్నవిషయంగా కనిపిస్తోంది. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ల సినిమాల బిజినెస్ అంచనాల్ని మించి పోతోంది. ముఖ్యంగా మహేష్ బాబు కొత్త సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే కళ్లు తిరిగిపోతోంది. ఇంతకుముందు రూ.150 కోట్ల టార్గెట్ అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల దాకా నిర్మాతలకు ఆదాయం తెచ్చిపెట్టబోతోందనే వార్త విస్మయానికి గురి చేస్తోంది.

‘స్పైడర్’ తెలుగు వెర్షన్ మాత్రమే థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.90 కోట్ల దాకా తెచ్చిపెడుతోందట. తమిళ వెర్షన్ ను ఇటీవలే లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ.23 కోట్లకు కొన్నట్లుగా సమాచారం బయటికి వచ్చింది. ఇక అన్ని భాషలకూ కలిపి ‘స్పైడర్’ శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.26 కోట్లు సమకూరుతున్నట్లు సమాచారం. ఇంకా హిందీ.. మలయాళం వెర్షన్లు కలిపి రూ.25 కోట్ల దాకా బిజినెస్ అయ్యే అవకాశాలున్నాయట. ఆడియో.. ఇతర హక్కులు కూడా కలిపితే ‘స్పైడర్’ బిజినెస్’ రూ.200 కోట్లు అవుతోందట. తెలుగులో ఇప్పటిదాకా ‘బాహుబలి’ మినహాయిస్తే ఇంకే సినిమా కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేసింది లేదు. బిజినెస్ అంచనాల్ని బట్టే ముందు రూ.90-100 కోట్ల మధ్య అనుకున్న బడ్జెట్ కాస్తా రూ.120 కోట్లకు పెంచారు. ఈ పెరుగుదల ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అంటున్నారు. సెప్టెంబరు 27న ‘స్పైడర్’ తెలుగు.. తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.